రాజకీయాలలో రోజురోజుకి కొరవడుతున్న హుందా తనం, జవాబుదారీ తనం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో తరుచుగా కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా మారుమూల ప్రాంతంలో ఉన్న సమస్యనైనా మంత్రుల వద్దకు చేర్చగిలిగే ఆ సమస్య పై సదరు మంత్రి నుంచి వెంటనే స్పందన రావడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం.
రోడ్లు కావాలి సార్ అంటూ బడిపిల్లలు ఉపముఖ్యమంత్రికి తమ అభ్యర్ధనను ఫలకార్డుల రూపంలో ప్రదర్శిస్తున్నా, కళాశాలకు సరైన సమయానికి వెళ్ళడానికి మా ఉరికి ఒక బస్సు కావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అవి వెంటనే వైరల్ అవుతున్నాయి, సదరు మంత్రిని చేరుతున్నాయి.
అలాగే ఆ మంత్రి వారి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపుతున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే ఈ మధ్య ఒక చిన్నారికి అరుదుగా వచ్చే ఒక వ్యాధి చికిత్స కోసం 16 కోట్ల విలువైన ఒక ఇంజక్షన్ కావాలి అంటూ సోషల్ మీడియాలో విన్నపం చేసుకోగా ఆ విన్నపం మంత్రి నారా లోకేష్ కి చేరింది.
అలాగే ఆ బాధిత కుటుంబానికి లోకేష్ తనవంతుగా 6 కోట్ల ఆర్ధిక సాయం అందించేందుకు సిద్దపడ్డారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ ఆ పాఠశాల విద్యార్థులు ఆ నాసిరకం భోజనం ను చెత్తబుట్టలో పడేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ సదరు వీడియో పై స్పందిస్తూ ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే జరిగిన తప్పిదానికి గాను ఆ పాఠశాల విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు వ్యక్తిగతంగా క్షమాపణలు తెలియచేసారు.
అలాగే జరిగిన సంఘటన మీద త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అనేదాని మీద నివేదిక కోరారు. ఇక ఆ పాఠశాలకు భోజన కాంట్రాక్ తీసుకున్న ఏజెన్సీ సంస్థకు కూడా కాంట్రాక్టు తొలగించారు. మరోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా లీఫ్ యాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని పర్యవేక్షణను భరింత బలోపేతం చేస్తామంటూ హామీ ఇచ్చారు.
అయితే ఇలా ఒక మంత్రి స్థానంలో ఉన్న నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తప్పుకి గాను ఆ శాఖ మంత్రిగా తనవంతు బాధ్యతగా చాల హుందాగా స్పందించారు, అలాగే విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు క్షమాపణలు తెలిపి ప్రజలకు జవాబుదారిగా ఉంటూ రాజకీయాలలో మరోమెట్టు ఎక్కారు లోకేష్.
తమ శాఖలో తప్పు జరిగినప్పుడు, పొరపాటు దొర్లినప్పుడు ఇది ప్రతిపక్షాల కుట్ర అంటూ సమస్యను పక్కదారి పట్టించకుండా, అలాగే సమస్యను అధికారం అనే ఆయుధంతో కప్పెట్టకుండా ఇలా హుందాగా వ్యవహరించడం నేటి తరం రాజకీయ నాయకులకు మంచి స్ఫూర్తినిస్తుంది, అలాగే ప్రజల మన్ననలు పొందుతుంది.
I was alerted to the issue of poor food quality in a government school. We have acted immediately. A 3-member committee was formed, and based on their report, the food agency has been replaced, and subsequently the headmaster has been suspended.
We are strengthening oversight… https://t.co/bfYslxlJh0
— Lokesh Nara (@naralokesh) March 13, 2026




