
నేడు టీడీపీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభలో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగంలో చాలా పంచ్ డైలాగులు.. వాటికి కార్యకర్తలు చప్పట్లు కూడా పడ్డాయి.
పార్టీకి దేవాలయం వంటి కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడులు చేస్తే, టీడీపీ కార్యకర్తలు మీసాలు మేలేసి దమ్ముంటే రండి.. మేము ఇక్కడే నిలబడతాం అని ధైర్యంగా సవాలు విసిరారు. మన అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పూనుకున్నప్పుడూ మన కార్యకర్తలు అలాగే ధైర్యంగా పోరాడారు.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
క్లెమోర్ మైన్లకె భయపడాని మనం ఈ కామెడీ పీసులకు భయపడతామా? నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా లభించదని మనల్ని ఎద్దేవా చేసినవారికే ప్రతిపక్ష హోదా దక్కకుండా ఓడించాం. ఈసారి ఎన్నికలలో కూటమి స్ట్రైక్ రేట్ 94 శాతం మన ఓట్ షేర్ 58 శాతం సాధించాం,” అంటూ మంత్రి నారా లోకేష్ చాలా ఉద్వేగంగా ప్రసంగించారు.
ఇది టీడీపీ రాజకీయ సభ కనుక పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సాగిన ప్రయాణం, దానిలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వాటన్నిటినీ ఏవిదంగా అధిగమించి మళ్ళీ అధికారంలోకి వచ్చామో చెప్పుకోవడానికే ఈద్ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పార్టీ ముఖ్య నేతలందరూ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
ఎన్నికలలో విజయం సాధించి, అధికారంలోకి వచ్చినప్పుడే మళ్ళీ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ సభ.. దీనిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తదితరుల ప్రసంగాలు వారిలో మరింత స్పూర్తి కలిగిస్తాయి. టీడీపీకి నాయకులు కాదు కార్యకర్తలే వెన్నెముక వంటివారు.. పార్టీ పట్ల వారి నిబద్దత, వారి పోరాటాల కారణంగానే మళ్ళీ అధికారంలోకి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ నేడు పునరుద్ఘాటించారు.
కనుక ఎంతసేపు ‘మేము మాట్లాడుతాము.. మీరు విని చప్పట్లు కొట్టండి..’ అని అనుకోకుండా, వారి కోసం మనం ఏం చేస్తున్నాం?ప్రభుత్వం, పార్టీ పనితీరుపై వారు ఏమనుకుంటున్నారు?వంటి విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం.
Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?
ఇందుకోసం జిల్లా లేదా నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యకర్తలతో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తరచూ ముఖాముఖి సమావేశాలు నిర్వహించడం చాలా అవసరం.
అప్పుడే కార్యకర్తలకి కూడా పార్టీ అధిష్టానం మనల్ని గౌరవిస్తోంది. పార్టీలో మన మాటకు కూడా విలువ ఉందని భావిస్తారు. అదే పార్టీకి మరింత బలంగా మారుతుంది.