ఏపీలో నేటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ విధానం అమలు కాబోతున్న వేళ అటు మందుబాబులకు ఒక పక్క ఆనందం, మరోపక్క ఆందోళన రెండు ఏకకాలంలో కలుగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పాలసీతో మందుబాబులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండడం వారికి మంచి కిక్ ఇచ్చే వార్త. దానితో వారిలో ఒక పక్క ఆనందం వెల్లువుకుతుంది.
అలాగే కొత్త మద్యం పాలసీ అమలు చేయడంతో నేటి నుంచి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న దాదాపు 3 వేలకు పైగా ఉన్న వైన్ షాపులు మూతపడ్డాయి. దీనితో మందుబాబులకు నేటి నుంచి మరో పది రోజుల పాటు వైన్ షాపులు అందుబాటులో ఉండకపోవడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read – 2027లో జమిలి ఎన్నికలు… చంద్రబాబు నాయుడు సై?
గత వైసీపీ హయాంలో ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ వైన్ షాపులను నేటి కూటమి ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి ఈ నెల10 వ తేదీ వరకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి ఎవరైనా ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
అయితే ప్రభుత్వం నిర్దేశించిన రుసుము 2 లక్షలు కాగా దీన్ని జనాభా ప్రాతిపదికగా నాలుగు స్లాట్ల కింద విభజించి,రెండేళ్ల కాలపరిమితితో 50 లక్షల నుండి 85 లక్షల ఫీజు ను కేటాయించింది. అయితే ప్రభుత్వం ఈనెల 11 న లాటరీ పద్దతిలో వైన్ షాపులను కేటాయిస్తుంది.
Also Read – వైసీపి, టిడిపి… దేని ఉచ్చులో ఏది?
అప్పటి వరకు ఏపీలో వైన్ షాపులు తాత్కాలికంగా మూతపడినట్లే. దీనితో మందుబాబులు తమ మద్యం దాహం తీర్చుకోవాలి అనుకుంటే ఇక బార్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. వైన్ షాపుల తాత్కాలిక బంద్ బార్ల యాజమాన్యానికి మూడు బీర్లు ఆరు కోటర్లు కింద వ్యాపారం దండిగా సాగనుంది సుమీ..! వీళ్ళ ఇక్కట్లు వాళ్లకు ఇన్కమ్ గా మారింది.
Also Read – ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందేమో… జగన్ డౌట్!