
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తదితరులు ఈరోజు నెల్లూరు జైలులో ఉన్న తమ సహచరుడు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం కేతిరెడ్డి బయట మీడియాతో మాట్లాడుతూ, “ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో జైల్లో పెట్టే ఓ చెడు సాంప్రదాయం కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈరోజు జైల్లోకి వెళ్ళిచూసినప్పుడు లోపల సౌకర్యాలు అసలు బాగోలేవు.
మాకు మరో నాలుగేళ్ళపాటు ఈ తప్పుడు కేసులు, అరెస్టులు, జైలుకి రాకపోకలు ఎలాగూ తప్పవు. ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తే మీరూ ఇవే జైళ్ళలో ఇబ్బందిపడుతూ గడపాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎలాగూ స్కూళ్ళు, కాలేజీలకు మరమత్తులు చేయించలేదు.
Also Read – జగన్ భావోద్వేగం నిజమా? లేక అవసరమా?
కనీసం ఇప్పటి నుంచే రాష్ట్రంలో అన్ని జైళ్ళలో మరమత్తులు చేయించి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే మాతో పాటు రేపు మీకు కూడా ఇబ్బంది లేకుండా హాయిగా గడిపేయవచ్చు,” అని సలహా ఇచ్చారు.
ఐదేళ్ళ జగన్ విధ్వంస పాలన చూసిన తర్వాత, ఈ 5 ఏళ్ళు సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తారని జగన్, కేతిరెడ్డి వంటివారు ఎలా అనుకుంటున్నారో తెలియదు.
Also Read – జగన్‌వి శవరాజకీయాలట .. ఎంత మాటనేశారు నారాయణా?
కానీ వైసీపీ నాయకులు స్వయంగా జైల్లోకి వెళ్ళి చూసి వచ్చి, జైల్లో ఉండి వచ్చి సొంత అనుభవంతో చెపుతున్న మాట.. జైళ్ళలో సౌకర్యాలు లేవని! కనుక వారు జైళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నారని అర్దమవుతోంది. ఇంకా చాలామంది లోపలకు వెళ్ళి రావాల్సి ఉంటుందని వారే చెపుతున్నారు కూడా.
కనుక కూటమి ప్రభుత్వం అత్యవసరంగా నిధులు విడుదల చేసి జైళ్ళకు అవసరమైన మరమత్తులు చేయించి వైసీపీ నాయకులకు కాస్త సౌకర్యాలు కల్పిస్తే ఈవిదంగా పిర్యాదులు చేయరు.