గత వైసీపీ హయాంలో “మా నమ్మకం నువ్వే జగనన్న… జగన్ననే మా భవిష్యత్” అంటూ నినాదాలు చేసిన వైసీపీ నేతల మాటలు నమ్మి తమ అధికారాన్ని ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం వెచ్చించిన ప్రతి ఒక్కరి భవిష్యత్ ఇప్పుడు చుక్కాని లేని నావ మాదిరి, నడి సముద్రంలో చిక్కుకున్న పడవ మాదిరి తయారయ్యింది.
గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అధికారం కోసం, వైసీపీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు భవిష్యత్ లేకుండా పోయింది. గత ఐదేళ్లు వైసీపీ చేసిన పాపాలకు ఇపుడు వారు శిక్ష అనుభవిస్తున్నారు. ఇందులో వాలంటీర్లు మొదలుకుని ఐపీఎస్, ఐఏఎస్ వరకు అందరు బాధితులే.
Also Read – మరో వివాదంలో మంత్రిగారు..!
ఉదాహరణకు ఒక జిత్వాని కేసు విషయమే తీసుకున్నా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండతో తమ విధులను మరిచి, చట్టాలను ఉల్లంఘించి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వ ఉన్నతాధికారులే ఎన్నో తప్పటడుగులు వేశారు. వారు దాని ఫలితం నేడు అనుభవిస్తున్నారు. ఇందులో కర్త, కర్మ, వైసీపీ ప్రభుత్వం అయితే క్రియ మాత్రం అధికారులది కావడంతో ఆ పాప భారం మొత్తం వీరే మోయాల్సిన పరిస్థితి.
ఈ పాపంలో ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల భవిష్యత్ కటకటాల పాలయ్యింది. దీనికి వైస్ జగన్ బాధ్యత వహిస్తాడా.? అప్పుడు ఆయన మేలు కోసం రాష్ట్ర సరిహద్దులు దాటిన వీరి రక్షణ కోసం జగన్ ఇప్పుడు కనీసం గడప దాటతారా.? అలాగే జగన్ సృష్టించిన వాలంటీర్ల పరిస్థితి కూడా ఇదేమాదిరి అగమ్యగోచరంగా మారింది.
Also Read – ఏపీలో కేసుల బదిలీలు….
గత ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ జగన్ కోసం, వైసీపీ గెలుపు కోసం ఇంటిటా ప్రచారం నిర్వహించిన ఈ వాలంటీర్లు ఇప్పుడు వారి భవిష్యత్ కోసం ఎవరి ఇంటి ముందు దేహి అంటూ చేతులు చాచాలి.? గత ఐదేళ్లు జగన్ తన రక్షణ కోసం బయటకు వస్తే పరదాలు వాడుకున్నట్టు, తన పార్టీ భవిష్యత్ కోసం వాలంటీర్లను వాడుకున్నారు.
ఇప్పుడు ప్రభుత్వాలు మారడంతో రాష్ట్రంలో పరదాలు లేవు, వాలంటీర్లకు భవిష్యత్తు లేకుండా పోయింది. జగన్ ను నమ్ముకుని ఎన్నికల ముందు రాజీనామాలు చేసి, కూటమి పార్టీ నేతల మీద ఆరోపణులు చేసి, కేసులు పెట్టి, ముఖ్యమంత్రిగా జగన్ భవిష్యత్ కు మేము గ్యారెంటీ అంటూ కథం తొక్కిన వాలంటీర్లకు అసలు భవిష్యత్తే లేకుండా చేసారు జగన్.
Also Read – ఏపీలో మందుబాబులకు విముక్తి దక్కిందా..?
అలాగే ఇక రాబోయే 30 ఏళ్ళు వైసీపీ నే అధికారంలో ఉండబోతుంది అని జగన్ పలికిన చిలక పలుకులను నమ్మిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రత్యర్థుల పై అవసరానికి మించి విమర్శలు చేసి వారి రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టుకున్నారు. జగన్ ను నమ్మి అద్దు దాటితే వారి అడ్రెస్ గల్లంతే అంటూ గత చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పినప్పటికీ మళ్ళీ అదే పొరపాటు అలవాటుగా మారింది.
ఏది ఏమైనప్పటికి జగన్ నమ్మితే అది ప్రజలైన, వాలంటీర్లయినా, ఐపీఎస్, ఐఏఎస్ లాంటి అధికారులైన, రాజకీయ నాయకులైన చివరికి సొంత చెల్లైనా తల్లైన కూడా వారి భవిష్యత్ గోవిందా గోవిందా…అనేది స్పష్టమయింది.