‘పని లేని పులిరాజు’ పబ్లిసిటీ చూడండి!

Panileni Puliraju, Panileni Puliraju Promotions, Panileni Puliraju Dhanraj, Panileni Puliraju Movie Publicity, Panileni Puliraju Dhanraj Publicity“ఏ సినిమా అయినా సరే బాగుంటే నలుగురికి చెప్పండి… బాగుండకపోతే నలభై మందికి చెప్పండి తప్పులేదు…” కానీ, సినిమాను థియేటర్లో చూడకుండా చెప్పడమనేది కరెక్టు కాదని ప్రముఖ హాస్యనటుడు ధన్ రాజ్ అన్నాడు. తన తాజా చిత్రం 13 పాత్రల్లో నటించిన “పనిలేని పులిరాజు” సినిమా త్వరలో విడుదల కానున్న నేపధ్యంలో… ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు సంగతులన్నీ చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులు సినిమాను థియేటర్ లో చూడకుండా బాగుండలేదని చెప్పొద్దని.., ఎందుకంటే, థియేటర్ కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకులే తమను ఎదిగేలా చేస్తారని… ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూస్తేనే తమకు ఫుడ్, బెడ్ ఉంటుందని అన్నాడు. నిర్మాత ఎంతో కష్టపడి సినిమా తీస్తాడని… ఆ సినిమాకు సంబంధించిన పైరసీ సీడీలు బయటకు వస్తే ఎంతో నష్టపోతాడని అన్నారు. పైరసీని ప్రోత్సహించవద్దని, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులకు ధన్ రాజ్ విజ్ఞప్తి చేశాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories