త్వరలో “డిష్యూం” సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ముద్దుగుమ్మ పరిణితి చోప్రా, ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతోంది. ఆ ఆనందాన్నే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు కూడా చేరవేయాలనుకుందో ఏమో గానీ, తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
తన ఇద్దరు సోదరులైన సహజ్ చోప్రా, శివాంగ్ చోప్రాలతో కలిసి ముద్దు పెట్టించుకున్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. క్యూట్ గా నవ్వుతూ ఉన్న పరిణితి… తన సోదరుల గురించి “వీళ్ళిద్దరే తన బేబీస్” అంటూ పేర్కొంది. ఈ ఫోటో చాలా లవ్లీగా ఉందంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్.
ఇక, వరుణ్ ధావన్ సరసన నటించిన ‘డిష్యూం’ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై, వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లో పరిణితి వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే, మురుగదాస్ – మహేష్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందన్న వార్తలు క్రమంగా బలహీనపడి, పరిణితి ఈ సినిమా నుండి అవుట్ అనే కామెంట్స్ వ్యక్తమవుతున్న విషయం నెటిజన్లకు తెలిసిందే.



