Pawan Kalyan Distributing Own Money From His Pocket

రాజకీయాలలోకి వచ్చి ఏం రాబట్టుకున్నావ్ అనుకునే నాయకులు ఉన్న ఈ రోజులలో రాజకీయాలకు వచ్చి ఏం తిరిగిఇచ్చావ్ అనే నాయకులు కనపడడం చాలా అరుదు. ఇప్పుడు అటువంటి అరుదైన నాయకుడినే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక మీద చూస్తున్నారు ఏపీ ప్రజానీకం.

Also Read – బెంగుళూరు ప్యాలస్‌లో అపరిచితుడు

తన సొంత జేబులోని డబ్బుని పంచుతూ రాజకీయం చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి రెండో ఆలోచనకు తావుండదు. కష్టం అంటూ చేయి చాచితే తన చేతిలో ఎంత ఉందో కూడా చూసుకోకుండా సాయం చెయ్యగలిగిన గొప్ప వ్యక్తిగా రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ పేరు గట్టిగా వినపడుతుంది.

వచ్చేటప్పుడు ఎం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఎం పట్టుకుపోతాం, బతికున్నన్ని రోజులు తన శక్తి మేరకు సమాజానికి సేవ చెయ్యడం, కష్టం లో ఉన్నవారికి చేయుత నివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Also Read – పాపం శ్యామల… ఎలా నెగ్గుకొస్తారో?

కష్టం వస్తే తనవారికి కాపు కాయడమే కాదు కష్టమన్న ప్రతి వాడిని తన వాడుగా చేసుకుని తనవంతు సాయమందిస్తారు పవన్. సినీ ఇండస్ట్రీలో తన కష్టంతో తానూ సంపాదించుకున్న, కూడబెట్టుకున్న ప్రతి రూపాయిని చాల బాధ్యతగా, సక్రమంగా వినియోగిస్తున్నారు పవన్.

ఒక పక్క తన సొంత సొమ్ముతో జనసేన పార్టీని నడుపుతూ, మరోపక్క సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన అభిమానులకు దేవుడయ్యాడు పవన్. ఇప్పుడు పవన్ చేసిన పనితో ఆయన అభిమానులతో పాటుగా ఎంతోమంది కుటుంబాలకు కూడా ఒకరకంగా దేవుడయ్యాడు పవన్.

Also Read – కేజ్రీవాల్‌ కాదు… క్రేజీవాల్… 48 గంటల్లో రాజీనామా!

రెండు తెలుగు రాష్ట్రాలలో వరద తెచ్చిన విధ్వంసానికి రెండు రాష్ట్రాల ప్రజలతో పాటుగా ప్రభుత్వాలు కూడా అల్లాడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రతిఒక్కరు తమవంతుగా ప్రభుత్వానికి చేయూతనివ్వాలి. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటుంది అని మరోసారి నిరూపించుకుంది.

చిరు, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరు తమ తమ స్థాయికి తగ్గట్టుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయమందించారు. అలాగే పవన్ కూడా ఇటు ఏపీకి కోటి రూపాయిలు అటు తెలంగాణకు కోటి రూపాయిలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అక్కడితో ఆగిపోతే పవన్ స్పెషల్ ఏముంటుంది అన్నట్లుగా…డిప్యూటీ సీఎం తో పాటుగా పంచాయితీ రాజ్ శాఖకు కూడ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఈ వరద విపత్తుకు గురైన ప్రతి పంచాయితీకి లక్ష రూపాయిల చొప్పున 4 కోట్లు విరాళంగా ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యారు పవన్.

మొతం మీద 6 కోట్ల విరాళం ప్రకటించి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ మనసున్న శ్రీమంతుడు అనిపించుకున్నారు పవన్. రాజకీయాలకు వచ్చి ప్రజలు నుంచి ఎంత వెనకేసుకోవచ్చు అని ఆలోచించుకునే నాయకుల నుంచి, రాజకీయాలకొచ్చి ప్రజలకు ఏమిచ్చాం అనే ఆలోచించే నాయకులను చూస్తుంది ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రపదేశ్ మార్పు దిశగా ఒక అడుగు ముందుకేసింది కాబట్టే జగన్ లాంటి పెత్తందారీ రాజకీయానికి సమాధి కట్టి పవన్ లాంటి పేదల రాజకీయానికి అధికారాన్ని కట్టబెట్టారు. చేసిన మంచి ఎప్పుడోకప్పుడు తిరిగి దరి చేరుతుంది అని పవన్ నిరూపిస్తే చేసిన పాపాలు ఏనాటికైనా వెంటాడతాయి అని జగన్ నిరూపిస్తున్నారు.

వైసీపీ చేసిన పాపాల ఫలితమే ఒక దువ్వాడ, ఒక విజయసాయి, ఒక అనంతబాబు, ఒక అంబటి, ఒక అవంతి, ఒక గోరంట్ల మాధవ్…జనసేన చేసిన త్యాగాల ఫలితమే పోటీ చేసిన 21 కి 21 నెగ్గి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. మంత్రి అంటే శాఖల మీద సమీక్షలు చేసి చేతులు దులుపుకోవడం కాదని, చేయుత నివ్వడమని నిరూపించారు పవన్.

పవన్ ప్రకటించిన ఈ సాయంతో ఇటువంటి రాజకీయ నాయుడుని ఇంతవరకు చరిత్ర ఎరుగలేదు, ఇక ముందు చూడబోదు… “పవన్ ది లీడర్” అంటూ అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్టీమ్ మీడియాలో పవన్ పై ప్రశంసల జడివాన కురిపిస్తున్నారు.




అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ అందించిన విరాళం పై స్పందిస్తూ దాతృత్వం ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా నిరూపించుకునే పవన్ సమాజంలో ఎందరికో స్ఫూర్తినియం, అలాగే ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు వెలకట్టలేం,పవన్ కు నా ధన్యవాదాలు అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించారు.