అమరావతిపై పవన్ కళ్యాణ్ సరికొత్త లాజిక్!

Pawan Kalyan says TDP Amaravatiఅమరావతి తెలుగుదేశం పార్టీకి రాజధానిలా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి అమరావతిలో స్థిర పడదామనుకునే వారికి ఎలాంటి వసతులు కల్పిస్తారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ADVERTISEMENT

“ఏదైనా ప్రదేశం వారికి ఉందా? ‘33వేల ఎకరాల్లో ఒక్కో జిల్లాకు ఇంత భూమిని కేటాయించాం’ ‘ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పెట్టుకోవాలంటే ఫలానా ప్రదేశంలో పెట్టుకోవచ్చు’అని ఏదైనా మార్క్‌ చేశారా?,” అని పవన్ కళ్యాణ్ కొత్త పల్లవి అందుకున్నారు. రాజధానిలో వేరే జిల్లాల వారికి భూమి కేటాయించడం ఏంటి? ఆ మాటకి వస్తే గుంటూరు జిల్లా వాసులకి మాత్రం అక్కడ భూమి కేటాయిస్తుందా ప్రభుత్వం?

అసలు అలాంటి పద్ధతి ఏ రాష్ట్ర రాజధానిలో అయినా ఉందా? పేదల గృహనిర్మాణానికి కొంత భూమి కేటాయిస్తారు అక్కడి పేదలకు పక్కా ఇల్లులు కట్టి ఇస్తుందని ఎక్కడైనా కాకపోతే దానికి జిల్లాల ప్రాతిపదిక ఉన్నట్టు ఎక్కడా లేదు. కేసీఆర్ వంటి వారు కొన్ని రాష్ట్రాలకు ఆ రాష్ట్ర భవన్ ను కట్టించిన సందర్భాలు ఉన్నవి. అయితే ఈ జిల్లాల వారీగా స్థిర పడదామనుకునే వారికి వసతులు ఏంటి? రాజధానికి ఎవరైనా వచ్చి స్థిరపడవచ్చు కదా?

ADVERTISEMENT
Latest Stories