ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ అద్యక్షుడు అమిత్ షా రాసిన లేఖను,ఆ తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూస్తే ,రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని అర్ధం అవుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వేలాది కోట్లు ఇచ్చినా ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అమిత్‌షా అంటున్నారు.
ఎప్పటిలాగే రాష్ట్రానికి భాజపా అన్యాయం చేసిందని సీఎం మరోసారి అంటున్నారు. ఖర్చులపై అధికారుల కమిటీ వేసి ప్రజలకు లెక్కలు తెలియజేయవచ్చుగా’ అని పవన్ ప్రశ్నించారు. ఇదే సంధర్భంగా జనసేన నిజనిర్ధారణ కమిటి తేల్చిన లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు.
అయితే ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని లెక్కలు పవన్ కళ్యాణ్ దగ్గర ఎక్కడ ఉన్నాయి? నిజానికి పవన్ కళ్యాణ్ ఈ కమిటీ వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను లెక్కలు ఇవ్వమంటే కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతోనే ఆ కమిటీ తన రిపోర్టును తయారు చేసింది.
మరి వాళ్ళ లెక్కలు వాళ్ళనే వాడుకోమనడం ఏంటో? అసలు ఆ లెక్కలను వాడుకుని పవన్ కల్యాణే కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు. ఇప్పటిదాకా అటువంటిది పెద్దగా చేసినట్టు లేదు. జనసేన కమిటీ ఈ లెక్కలు తేల్చకముందే రాష్ట్రం ఆ లెక్కలు చెబుతుంది. ఆ కమిటీని బట్టి రాష్ట్రం చెప్పేది నిజమని తేలింది. మరి పవన్ కళ్యాణ్ ఇంకో కమిటి కోసం ఎందుకు అడుగుతున్నారో ఆయనకే తెలియాలి.



