ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టరు జేడీ లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. జనసేన లేక బీజేపీలో ఆయన జాయిన్ కాబోతున్నారనే ప్రచారం ఉంది. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. లక్ష్మినారాయణను ఆహ్వానించారు.
“మా పార్టీలోకి లక్ష్మినారాయణ వస్తారని ప్రచారం జరుగుతోంది.మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మి నారాయణ మా పార్టీ లోకి వస్తానంటే ఆహ్వానిస్తా.గతంలో ఒక్కసారి అయన నేను కలిశాం.మొన్న కూడా ఆవిర్భావ సభ రోజున నాకు మెసేజ్ పెట్టాడు.రెండు మూడు సార్లు SMSలు ఎక్స్ చేంజ్ చేసుకున్నాం,” పవన్ కళ్యాణ్ అన్నారు.
జగన్ కేసులో ఈయన విచారణ అదికారిగా ఉన్నారు. అప్పట్లో ఈయనపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసేది. జగన్ కేసును రాజకీయ కారణాలతోనే విచారణ జరిపారని ఆ పార్టీ వ్యాఖ్యానించేది. దీనితో ఆయన మీద ప్రజలలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఇది పార్టీకి ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.



