Phone-Tapping

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్‌ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారాలపై విచారణ జరిపి పలువురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన్నట్లు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు చెప్పారు.

బిఆర్ఎస్ పార్టీలో పలువురు నేతల ఫోన్లను, చివరికి రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాల వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి రహస్య లావాదేవీల గురించి తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసేవారిమని నిందితులు చెప్పారు.

Also Read – దువ్వాడకి జగన్‌ అవసరం లేదా మాధురీ మేడమ్?

ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు పోలీసుల వ్యానులలోనే తాము నియోజకవర్గాలకు డబ్బు సంచులు తరలించేవారిమని అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎస్‌ఐబీ) అధినేత ప్రభాకర్ రావు ఆదేశాలతో ఇవన్నీ చేసేవారిమని, ఆయన నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం నడుచుకునేవారని అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు చెప్పారు.

క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్ళిన ప్రభాకర్ రావు పేరిట అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అయితే అరెస్ట్ భయంతో ఆయన హైదరాబాద్‌ తిరిగి రాకుండా అక్కడే కాలక్షేపం చేస్తున్నారు.

Also Read – ప్రభుత్వ సభలంటే ఇలా ఉండాలా.?

ఈ విచారణ, ఆరోపణలపై మాజీ సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ ఫోన్‌ ట్యాపింగ్ తదితర వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, రేవంత్‌ రెడ్డి ఆ పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సింపుల్‌గా తేల్చి చెప్పేశారు.

ఇంత వరకు ఈ కధ క్లియర్‌గానే ఉంది. అయితే గత రెండు మూడు నెలలుగా ఈ ఫోన్‌ ట్యాపింగ్ కేసు ప్రస్తావనే వినిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై కేంద్రం నుంచి ఒత్తిళ్ళు చేసి ఈ కేసుని కేసీఆరే అటక మీద పెట్టించేశారా? లేకుంటే కేసీఆర్‌ మళ్ళీ రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయగల ఈ కేసు విచారణ హటాత్తుగా ఎందుకు చల్లబడిపోయింది?అని సందేహం కలుగుతుంది.

Also Read – జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ Vs మెగా ఫాన్స్ – ఎవరికి ఉపయోగం??

ఫోన్‌ ట్యాపింగ్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈవిదంగా వెనక్కు తగ్గినప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులపై జరుపుతున్న విచారణలు కూడా రాబోయే రోజుల్లో ఇదేవిదంగా అటక ఎక్కించేయకుండా ఉంటారా? అనే సందేహం కలుగుతుంది.




ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అర్వింద్ కేజ్రీవాల్‌, కల్వకుంట్ల కవిత అందరూ విడుదలైపోయారు. కనుక ఆ కేసు కూడా అటకెక్కిపోయిన్నట్లే అని అనుమానించక తప్పదు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడి, విచారణలు దేనికి… ప్రజాధనం వృధా తప్ప!