Vandebharat Trains

అత్యాధునిక సదుపాయాలతో దేశీయంగా తయారైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా 2019, ఫిబ్రవరి 15వ తేదీన ఢిల్లీ-వారణాశి మద్య పచ్చజెండా ఊపి ప్రారంభించడాన్ని దేశప్రజలందరూ హర్షించారు.

ప్రధాని నరేంద్రమోడీ నేడు మరో ఆరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళని రిమోట్ పద్దతిలో ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాత స్థానికంగా ఉండే కేంద్రమంత్రులు వాటికి పచ్చజెండా ఊపి సాగనంపడం ఆనవాయితీగా మారింది కనుక నేడు కూడా అదే జరిగింది.

Also Read – ఏపీలో కేసుల బదిలీలు….

ఈరోజు ప్రారంభించిన వాటిలో రూర్కెలా-హౌరా, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా, టాటానగర్-పాట్నా, టాటానగర్-బ్రహ్మపూర్ ఉన్నాయి. రేపు విశాఖ-దుర్గ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.

కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌లో చిన్న కల్వర్టుకైనా మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరాగలనే అప్రకటిత నిబందన ఉండేది. పదేళ్ళు అలాగే సాగింది కూడా.

Also Read – ప్రభుత్వ సభలంటే ఇలా ఉండాలా.?

అదేవిదంగా 2019 నుంచి నేటి వరకు దేశంలో ఎప్పుడు, ఎక్కడ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ప్రారంభించాలన్నా ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగానే జరూపుతుండటం ఆనవాయితీగా మారింది. ప్రతీ రైలుకి ఆయనే ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఉందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ప్రవేశపెట్టిన కొత్తలో అందరికీ అవి కొత్త గనుక వాటిని ప్రవేశపెట్టిన ఘనత తనకు, తన ప్రభుత్వానికి, పార్టీకి దక్కాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకోవడం తప్పు కాదు. అది సహజమే. కానీ దేశంలో 55 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు తిరుగుతున్నప్పుడు, నేటికీ ప్రతీసారి ప్రధాని నరేంద్రమోడీయే వాటిని ప్రారంభించాల్సిన అవసరం ఉందా?

Also Read – 2025..మెగా ఫాన్స్ ను టెన్షన్ పెట్టనుందా.?

రైల్వేమంత్రి, ఇతర కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డివిజనల్ రైల్వే అధికారులకు వాటిని ప్రారంభించే అవకాశం ఇవచ్చు కదా? ప్రతీసారి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను ప్రధాని నరేంద్రమోడీయే ప్రారంభించడం ద్వారా ఆయన ఏమి ఆశిస్తున్నారు?అసలు వాటితో ఆయనకు, బీజేపీకి, కేంద్రానికి ఏమి లభిస్తుంది?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.