
అధికారం వచ్చింది కదా అని అడ్డుఅదువు లేకుండా నోటికి, చేతికి పని చెప్పిన వైసీపీ నేతలందరూ ఇప్పుడు విచారణ వ్యక్తం చేస్తున్నారు. జగన్ అండ చూసుకుని తమ స్వామి భక్తి నిరూపించుకోవడానికి ప్రత్యర్థి పార్టీ కార్యలయాల మీద దాడికి సైతం వెనుకాడని వైసీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
ఇందులో భాగంగా నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రోద్బలంతో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి యత్నించి అరెస్టయిన నందిగామ సురేష్ పోలీస్ కస్టడీలో విచారం ఎదుర్కుంటున్నారు. విచారణ కొనసాగుతున్న ఈ తరుణంలో సురేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు.
గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెం గ్రామంలో ఉంటున్న నందిగామ సురేష్ ఇంట్లో తనిఖీలు మొదలు పెట్టారు అధికారులు. అయితే ఒకపక్క అటు సురేష్ ని విచారణ జరుపుతూనే ఇటు పక్క ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అంటే నందిగామ సురేష్ నుండి అధికారులు ఏమైనా కీలక ఆధారాలు కనిపెట్టగలిగారా అంటూ టీడీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తుంటే, ఏ ఆధారాలు బయటపెట్టాడో అంటూ భయం గుప్పిట్లో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
సురేష్ టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు మా పార్టీ శ్రేణులకు బిపిలొచ్చాయి అందుకే టీడీపీ పార్టీ కార్యాలయం మీద నాలుగు రాళ్లేసారు అంటూ తనకు మద్దతు పలికిన జగన్, సురేష్ అరెస్టయిన సందర్భంలో కూడా ఆయనకు పార్టీ అండగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ జగన్ సురేష్ కు హామీ ఇచ్చారా.? లేక సురేషే ఈ కేసు తాలూకా ఆధారాలు బయటపెట్టాను భయపడకండి అంటూ జగన్ కు హామీ ఇచ్చారా అనేది టీడీపీ నేతలు సంధిస్తున్న ప్రశ్న.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మరికొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికి యథేచ్ఛగా బయట తిరుగుతూ వైసీపీ తరుపున రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే వారి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.