అహంకారంలో తండ్రి బాటలోనే కేటీఆర్‌

KTR, KCR, and Jagan criticized for arrogance after election defeats

అధికారంలో ఉన్నవారు అహంకారం ప్రదర్శించడం సహజం. కానీ దాని పర్యవసానాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయని ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీల ఓటమితో నిరూపితమైంది.

కనుక ఆ రెండు పార్టీల నేతలు కనీసం ప్రతిపక్షంలోకి మారినప్పుడైన ఈ అవలక్షణాన్ని వదిలించుకున్నారా?అంటే లేదు. పైగా ఆ అవలక్షణమే తమ ప్రత్యేకత.. అన్నట్లు ఇంకా మెరుగులు దిద్దుకుంటున్నారు.

ADVERTISEMENT

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను ఉద్దేశ్యించి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు.

నిన్న తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడు సిఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు మాజీ సిఎం కేసీఆర్‌ వద్దకు వెళ్ళి నమస్కరించి, షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఇది సభా మర్యాద. ముఖ్యమంత్రి తన వద్దకు వస్తుంటే కేసీఆర్‌ కూడా లేచి నిలబడి ఆయనకు నమస్కరించి కనీసం మర్యాద పాటించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డారు.

తన తండ్రి మొనగాడు… ఆయన తనకు చాలా గొప్ప. ఆయన బాటలోనే నడుస్తానని కేటీఆర్‌ మొన్ననే చెప్పుకున్నారు. కనుక సభలో తండ్రి, మిగిలిన ఎమ్మెల్యేలు లేచి నిలబడినప్పుడు కేటీఆర్‌ కూడా లేచి నిలబడాలి కదా? కానీ కేటీఆర్‌ ఒక్కరే లేవకుండా కూర్చున్నారు. ముఖ్యమంత్రికి మర్యాద ఇవ్వలేదు సరే! కనీసం తండ్రికి మర్యాద ఇవ్వలేదే?

పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌, మొన్న తెలంగాణ భవన్‌ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, చివరికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురించి చాలా చులకనగా మాట్లాడారు. నిన్న శాసనసభలో కేటీఆర్‌ తీరు గమనించినప్పుడు, అహంకారం విషయంలో ఆయన తండ్రిని మించిపోయారని చెప్పక తప్పదు. ఈ వీడియోని కాంగ్రెస్‌ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలు కూడా కేటీఆర్‌ తీరుని గ్రహించేలా చేస్తున్నారు. నగర ప్రజలు ఆ వీడియోని పెద్దగ పట్టించుకోకపోవచ్చు. మర్యాదల విషయంలో చాలా పట్టింపులు గల పల్లె ప్రజలు కేటీఆర్‌ తీరుని తప్పుగా భావిస్తారు కదా? దాని వలన ఎవరికీ నష్టం?

తమ అహంకారం వల్లనే తాము ఎన్నికలలో ఓడిపోయామని కేసీఆర్‌, కేటీఆర్‌, జగన్‌ ముగ్గురికీ తెలుసు. కానీ నేటికీ అది ఒప్పుకోవడం లేదు. అవసరం లేదు కూడా.

కానీ తమకు అహంకారం ఎక్కువని ప్రజలు భావిస్తున్నారనే సంగతి బాగా తెలుసు కదా? కనుక దానిని తగ్గించుకునే లేదా వదిలించుకునే ప్రయత్నం చేయాలి కదా?కానీ ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు!

కనుక వారు ఎప్పటికీ అలాగే ఉండాలని వారి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. అయినా వారికి అర్థం కావడం లేదు!

ADVERTISEMENT
Latest Stories