kcr-ktr-jagan

ప్రభుత్వాలు మారగానే రాజకీయ నాయకులపై నమోదు చేసిన కేసులు కూడా మారిపోతుంటాయి. ఆ మార్పులో భాగంగా కొన్ని కేసులు ఆటకెక్కిపోతుంటాయి. మరికొన్ని రాజకీయ కాలక్షేపానికి బాగా ఉపయోగపడుతుంటాయి తప్ప ఏ కేసులో నిందితులకు శిక్షలు పడిన దాఖలాలు కనిపించవు.

ఏపీలో ఆక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో గడిపి వచ్చినందుకు జగన్‌కు ముఖ్యమంత్రి పదవి బహుమతిగా లభించింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మళ్ళీ ఎంపీ సీటు దక్కింది.

Also Read – మామిడి సీజన్ ముగుస్తుంటే ఇప్పుడా పలకరింపులు?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్, కాళేశ్వరం కేసులు రాజకీయ కాలక్షేపానికి మాత్రమే అన్నట్లు ఏడాదిగా నోటీసులు, విచారణలన్నట్లు సాగుతున్నాయి. ఇదివరకు నోటీస్ ఇస్తే విదేశీ పర్యటనకి వెళ్తున్నా తిరిగి వచ్చిన తర్వాత వస్తానని చెప్పారు. కనుక జూన్ 16న విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ మళ్ళీ కేటీఆర్‌కి నోటీస్ పంపింది.

అయితే రెండు రాష్ట్రాలలో ఈ కేసులు, నోటీసులు, విచారణలతో నిందితులకే రాజకీయ మైలేజ్ లభిస్తున్నట్లు అనిపిస్తుంది.

Also Read – జనసేన ఎమ్మెల్యే లు: అరుంధతి నక్షత్రలా.?

అందువల్లే నోటీస్ అందుకుంటే ఇప్పుడు ఎవరూ ఆందోళన చెందడంలేదు. ఆ నోటీస్ లేదా కేసు విచారణ పేరుతో మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తూ జనం దృష్టిలో పడుతున్నారు. విచారణకు హాజరయ్యేటప్పుడు, ఎన్నికల నామినేషన్స్ వేసేందుకు బయలుదేరుతున్నట్లు వందల మంది అనుచరులను వెంటేసుకొని ఊరేగింపుగా బయలుదేరుతున్నారంటే ఏమనుకోవాలి?

ఓ కేసులో పోలీసుల నుంచి నోటీస్ వస్తే ఆందోళన కలగాలి కానీ నోటీస్ వస్తే దానినీ ఇలా వాడేసుకుందామన్నట్లు రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు.

Also Read – కాంగ్రెస్‌లో రోబోల తయారీ.. బీజేపి సెటైర్ అదిరిపోయిందిగా!


ప్రభుత్వం లేదా దాని తరపున పోలీసులు ఒక రాజకీయ నాయకుడిపై కేసు నమోదు చేసినప్పుడు, దానిలో నేరాన్ని వెలికితీసి శిక్ష పడేలా చేయాలనే ఆలోచనకి బదులు ఆ కేసుని అధికార పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకోవడం వల్లనే కేసులంటే అందరికీ అలుసైపోయాయి. కనుక ఇప్పటికైనా ఈ ధోరణి మారకపోతే పోలీస్ వ్యవస్థ క్రమంగా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంటుంది.