Prakash Raj Tweets On Supreme Court Order on Tirumala Laddu

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేసిన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన బలమైన ఆధారాలు ఏవీ లేకుండానే రాజకీయ కోణంలో ఈ వ్యవహారం గురించి మీడియాతో మాట్లాడి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాధన్‌లు అభిప్రాయపడ్డారు.

Also Read – మద్య నిషేదమని స్టోరీ చెప్పలేదు…

ఈ కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం చేత విచారణ జరిపించాలా లేదా సీబీఐ లేదా మరేదైనా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలా?అనే విషయం కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలిపిన తర్వాత తీర్పు వెలువరిస్తామంటూ గురువారానికి తదుపరి విచారణ వాయిదా వేశారు.

ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు అన్ని పత్రికలలో వచ్చాయి. వాటిని ట్యాగ్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్‌ “దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ రెండు చేతులతో దణ్ణం పెడుతున్న ఇమోజీలను పోస్ట్ చేస్తూ #జస్ట్ ఆస్కింగ్,” అని ట్వీట్‌ చేశారు. ఇందుకు ప్రకాష్ రాజ్‌ ఎంచుకున్న పత్రిక న్యూస్ క్లిప్పింగ్‌లో ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలున్నాయి.

Also Read – రాజకీయాలలోకి షాయాజీ షిండే… ఎమ్మెల్యే అనిపించుకుంటే చాలట!

కనుక చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇరువురు రాజకీయాలు చేస్తున్నారని, అలా చేయడం సరికాదని ప్రకాష్ రాజ్‌ చెప్పిన్నట్లే భావించవచ్చు.

ప్రకాష్ రాజ్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పు కాదు. కానీ ఆయన చేస్తున్న ఇటువంటి ట్వీట్స్ వలన ఇటు ఏపీలో అధికార పార్టీతో, అటు తెలుగు సినీ పరిశ్రమలో శత్రువులను పెంచుకుంటున్నారు కదా? ఈ స్థాయికి ఎదిగి ఇంత గుర్తింపు పొంది, ఇంత పరిణతి కలిగిన ప్రకాష్ రాజ్‌ పర్యవసానాలు గమనించకుండా తన అభిప్రాయాలు వెల్లడించాల్సిన అవసరం ఉందా?

Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?


జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణ మురళి, దర్శకుడు రాంగోపాల్ వర్మ తదితరులు ఈవిదంగానే పర్యవసానాల గురించి ఆలోచించకుండా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడినందుకు ఫలితం అనుభవిస్తున్నారు కదా?కనుక ప్రకాష్ రాజ్‌ ఇటువంటి ట్వీట్స్ చేయడం అవసరమా? జస్ట్ ఆస్కింగ్!