ప్రసాదం కల్తీ ఒక్క తిరుమలలోనేనా లేక…

tirumala-laddu

తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపధ్యంలో ఒక్క తిరుమలలో మాత్రమే కల్తీ జరిగిందా లేక రాష్ట్రంలో అటు పద్మావతీ అమ్మవారి ఆలయం మొదలు ఇటు బెజవాడ కనక దుర్గమ్మ, ఏలూరు చిన్న తిరుపతి, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్నస్వామి, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాల వరకు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో గల అనేక దేవాలయాలలో కూడా ఇటువంటి కల్తీకి ఆస్కారం ఉంటుంది.

ADVERTISEMENT

ఎందుకంటే హిందువులు పరమపవిత్రంగా భావించే తిరుమలలోనే జగన్‌ ప్రభుత్వం ఇటువంటి అపచారానికి పాల్పడినప్పుడు, రాష్ట్రంలో ఇతర దేవాలయాలను విడిచిపెడతారా?అంటే కాదనే అనిపిస్తుంది. అన్నవరం దేవాలయంలో ప్రసాదంపై గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చాయి కూడా.

కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరుమలతో సహా రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలలో ప్రసాదాల తయారీపై విచారణ జరిపించడం చాలా అవసరం. అప్పుడే జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయటపడతాయి.

ఇక విజయవాడ వరదలపై బురద రాజకీయాలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుని, టిడిపి కూటమి ప్రభుత్వంతో చెడుగుడు ఆడేసుకున్నానని మురిసిపోతున్న జగన్మోహన్‌ రెడ్డికి, వైసీపి నేతలకి చంద్రబాబు నాయుడు కొట్టిన ఈ దెబ్బ నుంచి తేరుకోవడం కష్టమే.

ముఖ్యంగా జగన్‌ క్రీస్టియన్ మతస్థుడు కావడం, హిందూ దేవుళ్ళ పట్ల ఈవిదంగా చులకనగా వ్యవహరించి ఉండటం వలన, రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలు సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు నూటికి నూరు శాతం నిజమే అని నమ్ముతున్నారు.

తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తూ, దీనిపై విచారణ జరిపించి బాధ్యులని కటినంగా శిక్షించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకి ఓ లేఖ వ్రాశారు.

జగన్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే తిరుమలలో ఈ అపచారం ఇంకా కొనసాగుతూనే ఉండేది. కానీ తిరుమల వెంకన్నతో ఆటలాడుకునందుకు ఎన్నికలలో ఓడిపోవడమే కాకుండా ఇప్పుడు ఈవిదంగా అడ్డంగా దొరికిపోయి, యావత్ దేశ ప్రజల దృష్టిలో దోషిగా నిలబడాల్సి వచ్చిందని గ్రహించడం లేదు.

ఇంత జరిగినా జగన్‌ తప్పు ఒప్పుకోకుండా గట్టిగా సమర్ధించుకోవడం ఖాయం. కనుక పూర్తిగా ప్రాయశ్చిత్తం జరగకమానదు.

ADVERTISEMENT
Latest Stories