ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘జబర్దస్త్’ రష్మి, సిద్ధూ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే వసూళ్ళను రాబట్టింది. రష్మి అందాల ప్రదర్శన బీ, సీ వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో ఓ మోస్తరు వసూళ్ళతో సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. అయితే ఇటీవల ఈ సినిమాపై ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే.
‘వికలాంగులను కించపరిచే విధంగా ఒక సన్నివేశం ఉందని’ తెలంగాణా వికలాంగుల అధ్యక్షుడు వెంకన్న అభ్యంతరాలు వ్యక్తపరచడంతో దిగివచ్చిన చిత్ర యూనిట్, శనివారం నుండి ఆ సీన్లను ప్రదర్శించబోమని నిర్మాత రాజ్ కుమార్ స్పష్టత చేసారు. సినిమాలోని కధలో భాగంగా ఆ క్యారెక్టర్ పై సన్నివేశాలను చిత్రీకరణ జరిపామే తప్ప… ఏ ఇతర ఉద్దేశంతో గానీ, ఎవరి మనోభావాలను కించ పరిచేందుకు గానీ షూటింగ్ చేయలేదని, సదరు సన్నివేశాలపై దర్శకనిర్మాతలు ఒక ప్రకటన చేసారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



