సన్ స్ట్రోక్ తగలబట్టే స్టాలిన్‌ ఓడిపోయారట!

Raghunandan Rao Targets Udhayanidhi Over Sanatana Row

సన్ స్ట్రోక్ రెండు రకాలు. మొదటి రకం సన్ స్ట్రోక్ అంటే వడ దెబ్బ తగిలితే మెల్లగా తేరుకోవచ్చు. రెండో రకం సన్ స్ట్రోక్ (కొడుకు వలన రాజకీయంగా ఎదురుదెబ్బ)తగిలితే తేరుకోవడం అంత వీజీ కాదు. తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా అలాగే రెండో రకం సన్ స్ట్రోక్‌ వలన పదవి, అధికారం కోల్పోయారని తెలంగాణ బిజేపి ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

నేడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ, “స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడానికి కారణం ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడే పిచ్చి మాటలే. నేడు శాసనసభ తొలి సమావేశంలోనే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడనే సనాతన ధర్మాన్ని ఎంతగానో గౌరవించే తమిళ ప్రజలు తండ్రీ కొడుకులను గద్దె దించేశారు. అయినా ఉదయనిధి స్టాలిన్‌కి బుద్ధి రాలేదని నిరూపించుకున్నారు. అతను ఇలాగే మాట్లాడుతుంటే, చివరికి ఆ ప్రతిపక్ష బెంచీలలో ప్రజలు నిన్ను కూర్చోనీయరని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT

సనాతన ధర్మం ఎవరికైనా అపకారం చేసిందా? వ్యతిరేకించడానికి? నాడు మొఘల్ రాజులు మొదలు నేడు ఉదయనిధి స్టాలిన్ వరకు చాలా మంది సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయిన నశింపజేయగలిగారా? లేదు కదా? అలా ప్రయత్నించినవారే నశించిపోయారు. ఎన్నికలలో డీఎంకే పార్టీ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం కాదా?

అయినా సనాతన ధర్మం కులమతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా ‘సర్వేజనా సుఖినోభవంతు,’ అని కోరుకుంటుంది తప్ప ఎవరూ నాశనం అయిపోవాలని కోరుకోదు. భారత్‌ ప్రభుత్వం ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తూ కోవిడ్ సమయంలో వాక్సిన్లు తయారుచేసి ప్రపంచ దేశాలకు అందజేసింది కదా?

విశ్వశాంతిని కోరుకునే సనాతన ధర్మం వద్దనుకునే వాళ్ళనే ప్రజలు వద్దనుకుంటారని డీఎంకే ఓటమితో రుజువైంది కదా?అయినా ఉదయనిధి స్టాలిన్ ఇంకా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ తండ్రికి, పార్టీకి రాజకీయంగా నష్టం కలిగిస్తూనే ఉన్నారు,” అని రఘునందన్ రావు అన్నారు.

ఇదివరకు జగన్‌ ప్రభుత్వం టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా చులకనగా మాట్లాడారు. బీఆర్ఎస్‌ పార్టీ ఓటమికి అదీ ఓ కారణమైంది. కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళడం వలన తమ పార్టీకి డాటర్ స్ట్రోక్ కూడా తగిలిందని కేటీఆర్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశరాజకీయాలను కంటి సైగతో శాశించారు. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు తల్లి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని కాలదన్నుకొని తాను నష్టపోయారు. కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికలలో గెలిపించుకోలేక పార్టీకి నష్టం కలిగించుకున్నారు. కనుక రెండో రకం సన్ స్ట్రోక్ చాలా ప్రమాదకరమైనదే!

ADVERTISEMENT
Latest Stories