2000 కోసం 3.54 రూపాయలు… 500 కోసం 3.09 రూపాయలు…!

rbi-expenditure-for-notes-printing-rs-500-1000దేశంలో పాత 500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌రువాత రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో కొత్త‌ నోట్ల‌ను ముద్రిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఇందు కోసం ఎంత ఖ‌ర్చు అవుతోందని సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ ఓ వ్య‌క్తి వివరాలు అడిగారు. అందుకు రిజర్వు బ్యాంకు అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంపీఎల్) సంస్థ వివ‌రాలు వెల్ల‌డించింది.

కొత్త 500 నోటును ముద్రించాలంటే ఒక్కోదానికి 3.09 రూపాయలు, 2 వేల రూపాయల నోటు ముద్ర‌ర‌ణ‌కు 3.54 రూపాయలు చొప్పున ఖర్చవుతుంద‌ని పేర్కొంది. దీని ప్ర‌కారం 1000 నోట్ల ముద్రణకు గానూ కొత్త 500 రూపాయ‌ల నోట్ల‌ ముద్రర‌ణ‌కు గాను మొత్తం 3090 ఖర్చవుతుందని, 2000 రూపాయల నోట్లకు 3540 ఖ‌ర్చు అవుతుంద‌ని పేర్కొంది. తాజాగా మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త 500 రూపాయల నోట్ల బ్యాచ్‌ ని రెండు నంబర్ ప్యానళ్లలోను ‘ఆర్’ అనే అక్షరంతో ముద్ర‌ణ చేస్తున్న‌ట్లు రిజ‌ర్వు బ్యాంకు తెలిపింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories