ఆర్బీఐ సమాధానం చెప్పలేని ప్రశ్న?

rbi-right-to-information-actపెద్ద‌ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి ముందు జ‌రిగిన ప‌లు అంశాల వివ‌రాల‌పై సమాచార హక్కు చట్టాన్ని ఉప‌యోగిస్తూ ఓ వ్యక్తి ఆర్‌బీఐని అడిగిన‌ ప్ర‌శ్న‌కు స‌మాధానం రాలేదు. అయితే ఆ ప్రశ్న ఆ చట్టం పరిధిలోకి రాదని స్ప‌ష్టం చేసిన ఆర్‌బీఐ… ఆ వ్య‌క్తి కోరిన సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని కూడా తేల్చిచెప్పింది. ఇంత‌కూ ఆ వ్య‌క్తి ఏ విష‌యాన్ని అడిగాడ‌న్న విష‌యాన్ని చూస్తే…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పెద్ద‌ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే ముందు ఆర్థిక‌శాఖ ప్రధాన సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యంను గానీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ గానీ, ఆర్‌బీఐని సంప్రదించిందా? అని ప్రశ్నించాడు. కేంద్ర ఆర్థిక శాఖ త‌మ వ్యూహాలను వివరించిందో లేదో చెప్పాల‌ని కోరాడు. అయితే దానికి ఆర్‌బీఐ నిరాక‌రించింది. ఈ ప్ర‌శ్న‌ల‌ను అడిగిన స‌ద‌రు వ్యక్తి, ఆ ప్ర‌శ్న‌ల లేఖ‌ను ఆర్‌బీఐతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పంపించాడు. అయితే, ఈ రెండింటి నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడం విశేషం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories