
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు నేడు ఆయన కుమారుడు జగన్ వరకు వారి కుటుంబంలో, వారి పార్టీలలో చంద్రబాబు నాయుడుపై కోర్టులో కేసులు వేయనివారు లేరు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారంటూ పలు కమిటీలు వేసి విచారణ జరిపించారు. లేనప్పుడు కోర్టులో పిటిషన్లు వేశారు.
Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!
బైబిల్ చేతపట్టుకొని రాజకీయాలు మాట్లాడే విజయమ్మ, అక్రమాస్తుల కేసులలో జైలుకి వెళ్ళివచ్చిన విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుపై పిటిషన్లు వేశారు. అందరూ కలిసి దాదాపు ఓ 25-30 పిటిషన్లు వేసి ఉంటారు.
చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడాభివృద్ధి కొరకు ‘ఐఎంజీ భారత అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 850 ఎకరాలు భూకేటాయింపులు చేశారని ఆరోపిస్తూ పిటిషన్లు వేశారు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
అయితే వైఎస్ వేసిన కమిటీలు, కోర్టులో దాఖలైన పిటిషన్లు ఏవీ కూడా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని నిరూపించలేకపోయాయి. కానీ ఒకరి తర్వాత మరొకరు వరుసగా పిటిషన్లు వేస్తూ చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారనే దుష్ప్రచారం మాత్రం చేయగలిగారు.
వాటన్నిటిపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టి అన్నిటినీ కొట్టి పడేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
కోర్టులో పిటిషన్లు వేసేవారు సదుదేశం, నిజాయితీతో వేయాలి. వాటిలో వాస్తవాలను దాచిపెట్టి కోర్టులను తప్పు దారి పట్టించే ప్రయత్నాలు చేయకూడదు. ఇదే కేసుకి సంబందించి ఒకరు వేసిన పిటిషన్‌పై మరో కోర్టులో విచారణ జరిపి కొట్టివేసిందనే విషయం దాచిపెట్టి మరో పిటిషన్ వేయడం సరికాదు.
చట్టం అంటే ఎత్తులు పై ఎత్తులు వేసుకొని ఆడే చదరంగం కాదని గ్రహించాలి. ఈ కేసులో కొన్ని నిజాలను దాచిపెట్టి ఆరేళ్ళ తర్వాత దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టుని ఆశ్రయించడం రాజకీయ దురుదేశంతో కూడినట్లు కనిపిస్తోంది.
(వైఎస్) ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ జరిపి ఎలాంటి నివేదిక ఇవ్వనప్పుడు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానప్పుడు ఇక కేసు ఎక్కడ ఉంది? లేని కేసు కోసం సీబీఐ విచారణ దేనికి?” అంటూ పలువురు వేసిన పిటిషన్లని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
చంద్రబాబు నాయుడుని దోషిగా ప్రజల ముందు నిలబెట్టి ఆయనను రాజకీయంగా సమాధి చేయాలని నాడు వైఎస్ కుటుంబం, నేడు జగన్, వైసీపి నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఐఎంజీ కేసులతో చంద్రబాబు నాయుడుకి హైకోర్టు చేత వారే క్లీన్ చిట్ ఇప్పించారు. పైగా హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన వారందరికీ మొట్టికాయలు కూడా పడ్డాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి టిడిపిని తుడిచిపెట్టేయలని జగన్ అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినందుకు వైసీపి తుడిచిపెట్టుకుపోయింది. అందుకే పెద్దలు ‘చెడపకురా చెడేవు’ అని ఎప్పుడో చెప్పారు. కానీ చెవికెక్కించుకుంటేగా?