నేడు తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ 25 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని ఒక చచ్చిన శవం తో పోల్చారు.
చనిపోయిన శవానికి ఎంతలా అలంకారం చేసినా ప్రయోజనం ఉంటుందా.? బిఆర్ఎస్ కి గతమే తప్ప భవిష్యత్ లేదు అంటూ బిఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేసారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కల్వకుంట కవిత కొత్త గా ఏర్పాటు చేసిన తెరాస పార్టీ పై కూడా తనదైన శైలిలో స్పందించారు.
ప్రస్తుతం ఉన్న పార్టీకే దిక్కులేదు, ఇక కొత్త పార్టీకి ఎం పని అంటూ మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు రేవంత్. అలాగే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ లను వేదవులు అంటూ సంభోదిస్తూనే కేసీఆర్ తన కుమార్తె కవిత అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పగలరా.?
కవిత కేసీఆర్ పక్కన రాబందులు ఉన్నారంటున్నారు, మరి ఆ రాబందులు గురించి వివరించగలరా.? సొంత కుమార్తె కేసీఆర్ ని మర మనిషి అంటూ విమర్శిస్తున్నారు దానికి బిఆర్ఎస్ దగ్గర సమాధానం ఉందా.? అంటూ రేవంత్ బిఆర్ఎస్ పార్టీ పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
అయితే బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజే రేవంత్ ఇలా బిఆర్ఎస్ ని చచ్చిన శవం తో పోల్చడం బిఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ విమర్శల పై బిఆర్ఎస్ ఎదురుదాడికి దిగితే మరి కవిత ఆరోపణల మీద ఆ పార్టీ శ్రేణులు ఎందుకు మౌనం వహిస్తున్నారు అనే ప్రశ్న బిఆర్ఎస్ ని నిలదీస్తుంది.
అలాకాకుండా రేవంత్ ఘాటు వ్యాఖ్యలకు బిఆర్ఎస్ కౌంటర్ ఇవ్వలేకపోతే రేవంత్ విమర్శిస్తున్నట్టు తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయంగా అంపశయ్య మీద పడుకున్నట్టే అవుతుంది.







