ఓటుకు నోటు..ముగిసిన అధ్యాయమేనా.?

Revanth Reddy

ఓటుకు నోటు కేసుతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇరుకున పెట్టడానికి రెండు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు తమవంతు కృషి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టనికి బిఆర్ఎస్ పార్టీ నేత జగదీష్ ఈ కేసును తెలంగాణ నుండి మధ్యప్రదేశ్ కు తరలించాలంటూ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు.

అలాగే ఏపీలో ఈ కేసు పట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ కూడా అవసరానికి మించి ఆసక్తి చూపించి కోర్ట్ నుండి నాలుగు మొట్టికాయలు తిని ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులో సాక్ష్యులను ప్రభావితం చేసి కేసును ముందుకు సాగనివ్వకుండా చేసే అవకాశం ఉందంటూ కోర్ట్ తలుపు తట్టారు జగదీశ్.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ రేవంత్ సొంత రాష్ట్రమైన తెలంగాణ కు బదులుగా మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ గత కొద్దికాలం క్రితం జగదీశ్ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే దాని మీద విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ తుది తీర్పును వాయిదా వేసింది.

అయితే నేడు ఈ కేసులో తుది తీర్పును వెల్లడించారు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి. ఈ పిటిషన్ ను ఇంకా మేము ఎంటర్టైన్ చేయలేమంటూ, జగదీశ్ ఆరోపిస్తున్నట్లు రేవంత్ ఈ కేసును ప్రభావితం చేస్తారు అనుకోవడం ఒక అపోహే అంటూ ఓటుకు నోటు కేసు విచారణను ముగించింది సుప్రీం ధర్మాసనం.

దీనితో ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ కు మంచి ఊరట లభించినట్లయింది. అలాగే రేవంత్ ను ఇరుకున పెట్టడానికి బిఆర్ఎస్ శ్రేణుల పన్నిన పన్నాగాలకు న్యాయస్థానాలు సరైన బుద్ది చెప్పాయంటూ కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్ నేత జగదీశ్ పై మండిపడుతున్నారు. దీనితో ఇక ఓటుకు నోటు కేసు “ప్రస్తుతానికి” ముగిసిన అధ్యాయమనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories