బిఆర్ఎస్ నేతల కంగారు…రేవంత్ దూకుడు..!

Revanth Reddy

తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలకు దూకుడుగా కౌంటర్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టి కనీసం మూడు నెలలైనా నిండకుండానే బిఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పై విమర్శలకు దిగడం, కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం ప్రభుత్వాన్ని నడపలేదని, రానున్న కొద్దీ రోజులలోనే ఈ ప్రభుత్వం కూలిపోబోతుంది అంటూ పదే పదే చేస్తున్న విమర్శలకు రేవంత్ తనదైన స్టైల్ లో రిప్లయి ఇచ్చారు.

ADVERTISEMENT

ఇంద్రవెల్లి సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ బిఆర్ఎస్ నేతల పై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అయ్యా ఎవడ్రా ప్రభుత్వాన్ని పడకొట్టేది, మీ ఊర్లలో ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొడుతా అంటే వేప చెట్టుకు కట్టి కోదండం వేసి కొట్టండి అంటూ ఆరు నెలలో ఈ ప్రభుత్వం పడిపోవడం కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయం అంటూ మాట్లాడిన బిఆర్ఎస్ నేతలకు ఒకరకంగా హెచ్చరికలే పంపారు రేవంత్.

కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కి సీఎం కావాల్సిందే..,ఆయన మళ్ళీ సీఎం కాదుకదా మంత్రి కూడా కాలేరు. ఒకవేళ కేసీఆర్ సీఎం అవ్వాలనుకుంటే నిత్యానందల ప్రత్యేక దివి కొనుక్కుని దానికి ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆయన పాపాల భైరవుడు అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అనే కనీస బాధ్యత లేకుండా బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు వారి తొందర పాటు తనాన్ని సూచిస్తుంటే, ముఖ్యమంత్రి స్థాయి పదవిలో ఉండి ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శల ఉచ్చులో పడి మాజీ ముఖ్యమంత్రి పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్ దూకుడు కి అద్దం పడుతుంది. రెండు పార్టీల నేతలు కాస్త సంయమనం పాటించి ముందుకెళ్లడం రాజకీయాలలో అత్యంత అవసరమని గుర్తించాలి.

ADVERTISEMENT
Latest Stories