
పోలవరం గురించి అంబటి రాంబాబు, పరిశ్రమలు, పెట్టుబడుల గురించి గుడివాడ అమర్నాథ్ , వివేకా హత్య గురించి అవినాష్ రెడ్డి, రేషన్ బియ్యం గురించి పేర్ని నాని మాట్లాడితే ఎలా అనిపిస్తుందో తిరుమల గురించి మాజీ మంత్రి రోజా మాట్లాడితే సరిగ్గా అలాగే అనిపిస్తుంది.
వైసీపీ అధికారంలో ఉన్నానంత కాలం ఆమె నెలకు కనీసం నాలుగుసార్లు డజన్ల కొద్దీ అనుచరులను వెంటబెట్టుకొని వెళ్ళి అందరికీ బ్రేక్ దర్శనాలు చేయించేవారు.
Also Read – సంగీతంలో లెజెండ్ – మీడియా అంటే ఆమడ దూరం. వివాదాల భయమా?
తిరుమల స్వామివారి పట్ల ఎంత భక్తి ఉన్నా ఎవరూ నెలకు నాలుగుసార్లు దర్శనం చేసుకోరు కదా?కానీ ఆమె వారం వారం అంత మందిని వెంటేసుకొని ఎందుకు వచ్చేవారు?అంటే అలా వెంటపెట్టుకొని వచ్చినవారి నుంచి ఆమె భారీగా ‘బ్రేక్ దర్శనం ఫీజు’ వసూలు చేసుకొని బాగా వెనకేసుకున్నారని అప్పుడే గుసగుసలు వినిపించేవి.
ఆమె ఇప్పుడు, ‘తిరుమల శ్రీవారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశ్రాంతి ఇవ్వడం లేదని, సామాన్య భక్తుల దర్శనాలు తగ్గించేసి, వీఐపీల బ్రేక్ దర్శనాలు పెంచేసిందని ట్వీట్ చేశారు.
Also Read – సుబ్బారెడ్డి vs సాయి రెడ్డి…
జగన్ హయాంలో రోజుకి లక్ష మంది సామాన్య భక్తులకు దర్శన భాగ్యం లభించేది. కానీ ఇప్పుడు వారి సంఖ్యని 60,000 కి తగ్గించేసి, రోజుకి 7-10,000 మంది వీఐపీ భక్తులకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తోంది. దీని వలన స్వామికి నిద్ర లేకుండా పోతోంది.
సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు,” అంటూ నీతులు చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read – హైడ్రా ఎమ్మెల్యే వసంతపై పడిందేమిటో!
నేటికీ ఆమె తరచూ తిరుమల శ్రీవారిని బంధుమిత్ర సమేతంగా బ్రేక్ దర్శనం ద్వారానే దర్శించుకుని వెళుతున్నారు. కానీ ఆ విషయం గుర్తులేననట్లు బ్రేక్ దర్శనాల గురించి ట్వీట్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
గతంలోలాగ ఇప్పుడు డజన్ల కొద్దీ అనుచరులను వెంట పెట్టుకొని లోపలకు ప్రవేశించలేకపోతుండటం వల్లనే ఆమెకు ఇప్పుడు భగవంతుడు, సంప్రాదాయలు గుర్తు వచ్చాయేమో?