ఆ ‘మిస్టరీ’ విల్లాను కొన్న ‘టాలీవుడ్’ హీరో!

Sachin joshi bought the kingfisher villa in gaoవిలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ విలాసవంతమైన విల్లాను ఏర్పాటు చేసుకుని, చివరికి బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన ‘లిక్కర్ బ్యారన్’ విజయ్ మాల్యాకు చెందిన విల్లా ఎట్టకేలకు అమ్ముడుబోయింది. గోవాలో నిలయమై ఉన్న ఈ విల్లాను వేలం వేస్తున్నప్పటికీ, కొనుగోలు దారులు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. దీంతో పలుమార్లు ధర తగ్గించినా ప్రయోజనం లేకపోయింది. అయితే తాజాగా జరిగిన వేలంలో సదరు విల్లాను తెలుగులో పలు చిత్రాలు చేసిన సచిన్ జోషి దక్కించుకున్నాడు.

ADVERTISEMENT

‘ఒరేయ్ పండు, మౌనమేలనోయి, నిన్ను చూడలేక నేనుండలేను, నీ జతగా నేనుండాలి’ వంటి తెలుగు సినిమాలలో నటించిన సచిన్ జోషి పలు హిందీ సినిమాలలో కూడా కనిపించారు. అయితే ఎక్కడ కూడా సరైన బ్రేక్ లేకపోయినా, మరో వైపు జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మాల్యా విల్లాను 73 కోట్ల కంటే ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సచిన్ అంగీకరించడంతో, ఎస్బీఐ అధికారులు సచిన్ కు సదరు విల్లాను కేటాయించారు.

సచిన్ జోషి ఈ విల్లాను సొంతం చేసుకున్నాడని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా ధ్రువీకరించారు. ఈ విల్లాను కట్టించుకున్న తర్వాతే మాల్యా తిరోగమనం ప్రారంభమైందనే ప్రచారం జరగడంతో, ఎంత విలాసవంతంగా ఉన్నప్పటికీ, అలాగే చౌకగా లభిస్తున్నప్పటికీ, కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో దీనిని ఎలా వదిలించుకోవాలా? అని తలలు పట్టుకున్న ఎస్బీఐ అధికారులకు సచిన్ రూపంలో ఎదురుకావడంతో ఊరట లభించింది.

ADVERTISEMENT
Latest Stories