సజ్జల ఆఖరి రాగం: టిడిపి ధీమాగా ఉంది గాబట్టే

sajjala-ramakrishna-re-polling-andhra-pradesh

జగన్‌ లండన్‌ వెళ్ళిపోయే ముందు గత ఎన్నికల కంటే ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించేసి విమానం ఎక్కేశారు. ఒకరిద్దరు మంత్రులు కూడా అలాగే చెప్పుకున్నప్పటికీ ఆ తర్వాత వైసీపి ఎవరూ కూడా ఆ మాట గట్టిగా చెప్పడం లేదు.

ADVERTISEMENT

కానీ కేంద్ర ఎన్నికల కమీషన్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, పోస్టల్ బ్యాలట్ విషయంలో ఈసీ నిర్ణయం సరికాదని, టిడిపి నేతలు రిగ్గింగ్ చేయిస్తుంటే పోలీసులు పట్టన్నట్లు చూస్తూ ఉండిపోయారంటూ ఆక్రోశిస్తున్నారు. ఇవాళ్ళ సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆఖరి రాగం కూడా పాడేశారు.

“ఎన్నికల కమీషన్‌ నిష్పక్షపాతంగా ఓ మ్యాచ్‌లో రిఫరీలా వ్యవహరిస్తూ ఇరు పక్షాలని సమానంగా చూడాలి. కానీ బీజేపీతో టిడిపి పొత్తు ఖరారు అయినప్పటి నుంచే ఈసీ ధోరణిలో మార్పు మొదలైంది. మాచర్లలో మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంని ధ్వంసం చేశారనే ఈసీ నమ్ముతోంది తప్ప అసలు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది?అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.

టిడిపి చాలా ధీమాగా ఉంది కనుక అది రీపోలింగ్‌ అడగటం లేదు. మా అభ్యర్ధికి అన్యాయం జరిగింది కనుకనే రీపోలింగ్‌ కోరుతున్నాము. కానీ కేంద్ర ఎన్నికల కమీషన్‌ అసలు మా అభ్యర్ధనలను పట్టించుకోవడమే లేదు. ఈసీకి చంద్రబాబు నాయుడు అనే వైరస్ సోకిన్నట్లుంది. అందుకే అది ఏపీలో టిడిపి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. కానీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీపై ఉంది కనుక మేము అడుగుతూనే ఉంటాము,” అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

వైసీపి నేతలు మాటలు వింటుంటే, ఈసారి ఎన్నికలలో తాము ఓడిపోబోతున్నామని గ్రహించిన్నట్లే ఉన్నారనిపిస్తుంది. కానీ మాచర్లలో వైసీపి ఓడిపోతే ఆంధ్రాలో అన్ని చోట్ల వైసీపి ఓడిపోతుందా?అంటే కాదు కదా? కానీ ఎన్నికలలో ఓడిపోబోతున్నామని చెప్పుకోలేక పదేపదే మాచర్ల గురించి మాట్లాడుతూ, తమకు ఈసీ అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు.

“చంద్రబాబు నాయుడు మోడీని, ఈసీని కూడా వశపరుచుకున్నారు. టిడిపి కంఫర్టబుల్‌గా ఉందని” అంటూ సజ్జల చివరి రాగం కూడా ఆలపించేశారు.

అంటే జూన్ 4 తర్వాత ప్రజలకు చెప్పుకోవడానికి వైసీపి నేతలు అప్పుడే అనేక సాకులు సిద్దం చేసుకుంటున్నారని అర్దమవుతోంది. వాటన్నిటికీ ‘మాచర్ల’ బేస్‌గా ఉండబోతోందని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories