సోషల్ మీడియా “రాణి” ఆమే!

Anushka-Sharmaసోషల్ మీడియాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రాలను సైతం ముద్దుగుమ్మ అనుష్క శర్మ పక్కకు నెట్టేసిందని ‘స్కోర్ ట్రెండ్స్’ సంస్థ తాజా సర్వే వెల్లడించింది. సోషల్ మీడియాలో అత్యంత ప్రభావశీల తారగా అనుష్క అవతరించింది. సోషల్ మీడియా, వార్తాపత్రికలు లాంటి ఇతర ప్రసార మాధ్యమాల్లో ఉనికి ఆధారంగా ఈ సర్వే సంస్థ సెలబ్రిటీలకు ర్యాంకులు కేటాయించింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు భారతదేశంలోని 14 భాషలలో వార్తాపత్రికలు, ప్రసార, డిజిటల్ వేదికల నుంచి ఈ డేటాని సేకరించినట్లు స్కోర్ ట్రెండ్స్ తెలిపింది. ఈ డేటా ప్రకారం… అనుష్క శర్మ ఇతర సెలబ్రిటీల కంటే మెండుగా 71.90 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. 50.43 స్కోరుతో ప్రియాంకా చోప్రా రెండో స్థానంలోనూ, 40.09 స్కోరుతో దీపికా పదుకునే మూడో స్థానంలోనూ, 31.78 స్కోరుతో కంగనా రనౌత్ నాలుగో స్థానంలోనూ నిలిచారు.

ADVERTISEMENT

ఈ గణాంకాలు కచ్చితమైనవని సర్వే సంస్థ సహ వ్యవస్థాపకులు అశ్విని కౌల్ చెప్పారు. టాప్-10 సెలబ్రిటీల్లో చోటు దక్కించుకున్న ఇతర బాలీవుడ్‌ స్టార్లలో సన్నీ లియోన్, సోనం కపూర్, శ్రద్ధా కపూర్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, మాధురీ దీక్షిత్ ఉన్నారు. విరాట్ కోహ్లి సతీమణి అయిన తర్వాత అనుష్క శర్మ రేంజ్ మరింతగా పెరిగిందనేది నెటిజన్ల మాట.

ADVERTISEMENT
Latest Stories