పార్టీ సోషల్ మీడియా పోస్టులకు… పార్టీ అధినేత బాధ్యుడా.?

Seethakka Sends Legal Notice to KCR Over Allegations

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ మహిళా మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు పంపణీ చేసింది. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని బిఆర్ఎస్ నాయకులు విమర్శలకు దిగారు.

అయితే తన పై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణల పై చెప్పుతెగుద్ది అంటూ మంత్రి సీతక్క కూడా ఘాటుగానే బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిఆర్ఎస్ సోషల్ మీడియా కేంద్రంగా మంత్రి పై అవినీతి ఆరోపణలు చేస్తూ పోస్టులు మొదలయ్యాయి.

ADVERTISEMENT

తన పై బిఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ దుష్ప్రచారాన్ని సీతక్క ఖండిస్తూ, ఇందుకు పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలంటూ కేసీఆర్ కి లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ సోషల్ మీడియా 48 గంటలలో లోపు తొలగించాలని,

లేదా పార్టీ అధినేతగా బాధ్యత వహిస్తూ కేసీఆర్ తనకు క్షమాపణలు చెప్పాలంటూ, లేదంటే నిర్ణిత గడువు తరువాత క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు మంత్రి సీతక్క. అయితే తన పై బిఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను మంత్రి సీతక్క పార్టీ అధినేతను బాధ్యుడిని చేస్తూ అందుకు కేసీఆర్ కి లీగల్ నోటీసులు పంపించడంతో ఏపీలో వైసీపీ సోషల్ మీడియా మీద చర్చ మొదలయ్యింది.

పొద్దున్న లేస్తే కూటమి పార్టీల నేతల మీద, ప్రభుత్వం మీద, రాష్ట్ర రాజధాని అమరావతి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తూ, రాజకీయాలకు సంబంధం లేని మహిళల పైనా, కూటమి పార్టీల మహిళా నేతల మీద, చివరికి వైఎస్ జగన్ సొంత తల్లి విజ్జయలక్ష్మి, చెల్లి షర్మిల, సునీతల మీద కూడా వైసీపీ అత్యంత అవమానకరంగా పోస్టులను పెడుతుంది.

మరి మంత్రి సీతక్క మాదిరే కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా వైసీపీ సోషల్ మీడియా అరాచకాలకు పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి ని బాధ్యుడిని చేస్తే ఇక ప్రభుత్వంలోని మంత్రులంతా వైస్ జగన్ కు నిత్యం వందలలో లీగల్ నోటీసులు పంపలేమో అంటున్నారు నెటిజన్లు.

ADVERTISEMENT
Latest Stories