పోలవరంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన మసూద్ కమిటీ నివేదక వచ్చింది. పోలవరం కాంక్రీట్ పనుల్లో నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా నిర్దేశించిన లక్ష్యంలోనే పోలవరం పనులు పూర్తవుతాయని నివేదికలో పేర్కొన్నారు.
మరోవైపు కాంక్రీట్ పనుల్లో నాణ్యత ఉందని మసూద్ కమిటీ స్పష్టం చేసింది. పోలవరం పరిహారం, పునరావాసంపై ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించి, నిర్వాసితులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన పునరావాసంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని నివేదికలో పేర్కొన్నారు.
బాధితుల స్టేట్‌మెంట్లను కూడా కమిటీ రికార్డు చేసింది. ఈ నివేదికను మూడు రోజుల క్రితం కమిటీ కేంద్రానికి అందజేసింది. ప్రధాని, కేంద్ర హోం శాఖ, నాబార్డ్, ఏపీ ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఈ నివేదికను ఈరోజో రేపో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. పోలవరంలో అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న వారిలో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. దీనితో ఆయనకు కూడా కనువిప్పు కలిగినట్టు అయ్యింది.



