నాడు సిద్ధం సభలు – నేడు పరామర్శల యాత్రలు…

Jagan Mohan Reddy during Paramaarsa Yatra symbolizing YSRCP’s political strategy shift

ఐప్యాక్ రాజకీయాలను నమ్ముకునే వైసీపీ ఎప్పుడు తానూ ఒక నీలి బుడగలో ఉంటూ ఆ బుడగలోకి యావత్ రాష్ట్ర ప్రజలను తీసుకెళ్లాలని భావిస్తుంది. ఈ రాష్ట్రంలో అత్యంత విశ్వసనీయత కలిగిన ఏకైక పార్టీ వైసీపీనే, అలాగే అత్యంత శక్తివంతమైన, ప్రజాబలమున్న నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డే అనే భ్రమలో వైసీపీ క్యాడర్ ని ఉంచుతుంది, అలాగే ఆ భ్రమలోనే ప్రజలను ఉంచాలని చూస్తుంది.

ఇందుకు వైసీపీ నాడు అనుసరించిన విధానాలు నేడు అవలంభిస్తున్న వ్యూహాలు అన్ని కూడా ఆ కోవకే చెందుతాయి. అందుకు నాటి వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన సిద్ధం సభలు నేడు జగన్ చేస్తున్న పరామర్శల యాత్రలు మంచి ఉదాహరణలుగా చెప్పొచ్చు.

ADVERTISEMENT

వై నాట్ 175…అందుకు మేము సిద్ధం, మీరు సిద్ధమా.? మండదా అక్కా, మండదా చెల్లి అంటూ నాడు వైసీపీ మొదలు పెట్టిన ప్రచార కార్యక్రమాలు మొదలుకుని, లోకేష్ కి మంగళగిరిలో మరోసారి అవమానం, పిఠాపురంలో పవన్ కి మరోమారు ఛీత్కారం, కుప్పంలో బాబు కి స్వస్తి…ఇందుకు వైసీపీ సిద్ధం, ఓటర్లు సిద్ధమా అంటూ నాడు సిద్ధం సిద్ధం అంటూ బ్లూ మ్యాట్ లతో వైసీపీ బలాన్ని చూపించిన సాక్షి ప్రజలను కూడా ఆ ట్రాప్ లోకి లాగాలని చూసింది.

జగనన్న ప్రజాబలం ముందు కూటమి చిత్తు, కూటమితో వైసీపీ కి వచ్చే చేటేమిలేదు అంటూ నాడు తన ప్రచార సభలకొచ్చిన జనం ను చూసి వైసీపీ తన వై నాట్ 175 కలను నెరవేర్చుకోవడానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నాము అంటూ తానూ నమ్మింది, అలాగే తమ ప్రచారాలను ప్రజలు సైతం నమ్మారు అనే భావనలోకి వెళ్ళింది.

తీరా కట్ చేస్తే వైసీపీ నమ్మకం 151 నుంచి 11 కి పతనమై కనీసం ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కూడా వైసీపీ 2.0 కోసం తన పార్టీ శ్రేణులను, ప్రజలను తిరిగి నమ్మించే పనిలో బిజీగా ఉంది వైసీపీ. అందుకు జగన్ ఎంచుకున్న వ్యూహం పరామర్శల యాత్ర.

తన పార్టీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు తిడితే తప్పేముంది అంటూ పరామర్శల యాత్రలు చేసుకుని మరి మైకుల ముందుకొచ్చి జగన్ వేస్తున్న ప్రశ్నలకు,

తమ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతింది, లడ్డు నెయ్యిలో కల్తీ కలిసింది అంటే కల్తీ నేగా, జంతు కొవ్వు కాదుగా అందులో పాపమేంటి అంటూ గొంతెత్తి అరుస్తున్న జగన్ అరుపులు అన్ని ప్రజామద్దతుతోనే జరుగుతున్నాయి అంటూ వైసీపీ ఇప్పటికే ఒక నీలి బుడగను సృష్టించి తన పార్టీ శ్రేణులను ఆ బుడగలోకి ప్రవేశపెట్టారు.

దీనితో జగన్ వేస్తున్న ఆ ప్రశ్నలకు, ఈ అరుపులకు తమకు, తమ పార్టీకి పూర్తి ప్రజాబలం లభించింది, లభిస్తుంది అనే భ్రమలోకి పార్టీ క్యాడర్ ని పట్టికెళ్లగలిగారు జగన్. అయితే నాడు సిద్ధం సభలతో వై నాట్ 175 అంటూ తన బలప్రదర్శనను, బలంగా భావించిన జగన్ ఇప్పుడు కూడా జగన్ 2.0 కోసం తన వెంట వచ్చిన, వస్తున్నా వైసీపీ క్యాడర్ బలప్రదర్శనను, ప్రజాబలంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories