ఇదివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహిరంగసభలలో తనకు ఎంతో పేరు తెచ్చిన 108 అంబులెన్స్ సేవల గురించి చెప్పుతూ ప్రజలు ఒక్క ఫోన్ చేయగానే అవి ‘కుయ్…కుయ్’ అని సైరన్ మ్రోగించుకుంటూ వచ్చి ఇంటి ముందు వాలిపోయి హుటాహుటిన రోగిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేవాని చెప్పుకునేవారు.
అందుకోసం ఆయన ‘కుయ్… కుయ్…’ అని దీర్గం తీస్తూ పలికినప్పుడు, ఓ ముఖ్యమంత్రి ఆవిదంగా మాట్లాడటం అప్పటికి కొత్త కనుక ప్రజలు దానిని చాలా ఆనందించారు. అది గమనించిన వైఎస్సార్ ఆ తర్వాత చాలా సభలలో ‘కుయ్ కుయ్…’ అంటూ ప్రజలను సంతోషపెట్టేవారు.
కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తండ్రి స్పూర్తితో జగన్ కూడా ఇటీవల సభలలో “దగ్గరకొచ్చేయ్… దగ్గరకొచ్చేయ్… దగ్గరకొచ్చేయ్…. నీకు 15 వేలు… నీకో 15వేలు… నీక్కూడా ఓ 15వేలు…” అంటూ టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి వెటకారంగా మాట్లాడారు. దానిని వైసీపి నేతలందరూ అనుకరిస్తూ వైరల్ చేయగలిగారు.
అయితే టిడిపిని ఎద్దేవా చేయబోయి జగన్ ‘దగ్గరకొచ్చేయ్…. దగ్గరకొచ్చేయ్….’ మాటలతో టిడిపి అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు. దానిపై వారు చిన్న పిల్లలని ఎత్తుకుపోయే ముఠా వ్యక్తిలా చూపిస్తూ సోషల్ మీడియాలో రకరకలా మీమ్స్ సృష్టించి పెడుతున్నారు. వాటిని చూసినప్పుడు ‘అయ్యో పాపం జగన్!’ అని అనుకోకుండా ఉండలేము.
అయినా జగన్‌కి తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు… చివరికి సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించాలన్నా, ఆ తిట్లన్నీ ముందే కాగితం మీద వ్రాసిస్తే అది చూసి చదువుతుంటారు. అటువంటప్పుడు ఇలా పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లు తండ్రిని అనుకరించడం దేనికి?అటువంటి మాటలతో ప్రజలనుఆకట్టుకోవాలనుకుంటే, తానే నవ్వులపాలవుతున్నారు కదా?






