దక్షిణాది భవిష్యవాణి..లోకేష్ – జగన్, రేవంత్ – కేటీఆర్, విజయ్ – ఉదయనిధి.?

South India Politics: Lokesh, KTR, Vijay vs Udhayanidhi

దక్షిణ భారతంలో భాగమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాజకీయాలు అన్ని కూడా ఒకే నావలో పయనించే ప్రయాణికుల మాదిరి కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు vs వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నప్పటికీ రాబోయే రోజులలో బాబు స్థానంలోకి ఆయన రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లోకేష్ రాక తప్పదు.

దీనితో రానున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నారా లోకేష్ vs వైఎస్ జగన్ రెడ్డి అనేలా సాగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇటు తెలంగాణ విషయానికొస్తే 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి నుంచి కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు అనధికారిక విశ్రాంతి ప్రకటించి ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యారు.

ADVERTISEMENT

దీనితో తెలంగాణ రాజకీయాలు అధికార పార్టీ నేత రేవంత్ vs ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ అన్నట్టుగా మారిపోయాయి. తండ్రుల రాజకీయ వారసత్వంతో రాజకీయ తెర మీదకొచ్చిన లోకేష్, జగన్, కేటీఆర్ ముగ్గురు కూడా తమ తమ రాజకీయ ప్రత్యర్థులతో నువ్వా – నేనా అన్నట్టుగా రాజకీయ యుద్ధం చేసారు, చేస్తున్నారు.

ఇందులో నారా లోకేష్, వైఎస్ జగన్ తమ పాదయాత్రలతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. వాటి ఫలితంగా 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అలాగే 2024 టీడీపీ ని అధికారంలోకి తేవడంలో లోకేష్ యువగళం కీలక పాత్ర పోషించింది, అలాగే

బాబు అరెస్టు సమయంలో పార్టీని తిరిగి నిలబెట్టడానికి లోకేష్ ఎంచుకున్న రాజకీయ విధానాలు, అవలంభించిన రాజకీయ వ్యూహాలు అన్ని కలిపి మరోసారి టీడీపీ ని అధికార పీఠం ఎక్కించాయి, బాబు ని ముఖ్యమంత్రి ని చేసాయి. కానీ కేటీఆర్ ఇప్పటికి తండ్రి చాటు బిడ్డ మాదిరే కేసీఆర్ నీడలోనే రాజకీయం చేస్తున్నారు.

పార్టీ ఓటమి నుంచి నేటి వరకు కేటీఆర్ నాయకత్వంలో నడుస్తున్న బిఆర్ఎస్ ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. అలాగే పార్టీ ని తిరిగి నిలబెట్టేందుకు కేటీఆర్ చేస్తున్న రాజకీయం కూడా బిఆర్ఎస్ కి సానుకూలలంగా మారడం లేదు.

దీనితో కేటీఆర్ తన రాజకీయ వారసత్వ బలాన్ని నిరూపించుకోవడానికి రేవంత్ తో ఢీ కొట్టి మరి తిరిగి బిఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురావాల్సి ఉంది. ఇక ఇప్పుడు వీరి కోవలోకే తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ అడుగుపెట్టారు.

సినీ ఇండస్ట్రీని వదులుకుని తండ్రి రాజకీయ వారసత్వంతో తమిళ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్ కు ఇప్పుడు అసలు సిసలైన రాజకీయ పరీక్ష ఎదురుకానుంది. ఇన్నాళ్ళుగా తండ్రి నీడలో రాజకీయం నడిపిన ఉదయనిధి ఇప్పుడు తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికలలో స్టాలిన్ ఎమ్మెల్యే గా కూడా ఓడిపోవడంతో ప్రతిపక్ష నాయకుడి స్థానంలోకి వచ్చారు.

దీనితో ఇక ఇప్పుడు తమిళ రాజకీయాలు టీవీకే అధినేత విజయ్ vs డీఎంకే నేత ఉదయనిధి అన్నట్టుగా సాగనున్నాయి. విజయ్ వంటి సినీ గ్లామర్, పొలిటికల్ మాస్ ఛరిష్మా ఉన్న నేతను ఢీ కొట్టి పార్టీని తిరిగి ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వారి ఆదరణను తిరిగి సంపాదించడం ఉదయనిధి ముందున్న అతిపెద్ద సవాల్ గా మారింది.

ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ నేతలను ఎండగట్టడం, ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపించడం, ప్రజా పోరాటాలు సాగించడం, అసెంబ్లీ లో తమ పార్టీ గళాన్ని బలంగా వినిపించడం వంటి కార్యక్రమాలు ఉదయనిధి రాజకీయ లక్షణాలను బయటకు తెస్తాయి.

ఇందులో తమిళనాడు సీఎం విజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగిలిన నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కల్వకుంట్ల తారకరామారావు, ఉదయనిధి స్టాలిన్ నలుగురు కూడా తండ్రి రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినవారే.

లోకేష్ ఇప్పటికే టీడీపీ లో తన నాయత్వం పై నమ్మకం కల్పించారు, అలాగే ఐటీ, విద్యా శాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వంలో తన మార్క్ చూపించగలిగారు. ఇక వైఎస్ జగన్ కు తల్లి, చెల్లితో ఉన్న విభేదాలు ఆయనను వ్యక్తిగతంగా దిగజారుస్తుంది. అలాగే జగన్ ఒక్క ఛాన్స్ విధ్వంశం వైసీపీ ని 151 నుంచి 11 కి తెచ్చింది.

ఇక కేటీఆర్ సైతం చెల్లి కవిత తో విభేదాలు ఎదుర్కోవడంతో ఆయన ఇప్పటికి తండ్రి చాటు బిడ్డ మాదిరే నడుచుకుంటు తనను తానూ నిరూపించుకునే పనిలో ఉన్నారు. అలాగే ఉదయనిధి స్టాలిన్ కూడా ఇక స్టాలిన్ నీడ నుంచి బయటకొచ్చి సొంతగా రాజకీయంగా తానూ ఎదుగుతూ పార్టీ ని కూడా రాజకీయంగా తిరిగి నిలబెట్టగలగాలి.

అందుకే రానున్న దక్షిణాది రాజకీయం : లోకేష్ vs జగన్, రేవంత్ vs కేటీఆర్, విజయ్ vs ఉదయనిధి అన్నట్టుగా సాగె అవకాశం కనిపిస్తుంది. మరి ఈ దక్షిణాది భవిష్యవాణిలో ఎవరు ప్రజల మద్దతు సంపాదించుకుంటారు.? ఎవరు తమ ప్రజాబలంతో పార్టీకి బలంగా మారతారు.?

పార్టీ చేతిలో ఉన్న అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం లోకేష్ కర్తవ్యం కాగా, పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి పార్టీ ముఖ్యమంత్రి నేతగా ఎదగడం కేటీఆర్, ఉదయనిధి స్టాలిన్ యొక్క రాజకీయ సవాల్ కానుంది, ఇక జగన్ కూటమి వంటి బలమైన బంధాన్ని ఢీ కొట్టి వైసీపీ 2.0 దిశగా పార్టీ శ్రేణులను నడిపించగలగాలి.

ADVERTISEMENT
Latest Stories