తిరుమల కల్తీ నెయ్యి అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సిట్ విచారణ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని డిజిపి ద్వారకా తిరుమల రావు స్వయంగా ప్రకటించారు.
Also Read – గేమ్ ఛేంజర్… నిజమే!
ఈ కేసుపై దర్యాప్తుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై గురువారం మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ జరుపబోతోంది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలియజేసిన తర్వాత ఏ స్థాయిలో విచారణ జరిపించాలనే విషయం చెప్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
కనుక అంతవరకు సిట్ విచారణ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని డిజిపి ద్వారకా తిరుమల రావు స్వయంగా ప్రకటించారు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతిస్తే సిట్ విచారణ కొనసాగిస్తామని డిజిపి ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.
Also Read – దువ్వాడ రాజీ ఒప్పందం… జనసేనకు ఓకేనా?
ఇది చాలా తెలివైన, మంచి నిర్ణయమని చెప్పవచ్చు. ఒకవేళ సిట్ విచారణ కొనసాగిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సిట్‌పై తమకు నమ్మకం లేదని వైసీపి వాదిస్తోంది. కనుక టిడిపి కూటమి ప్రభుత్వం ఈ పేరుతో తమపై రాజకీయకక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని వైసీపి వాదిస్తోంది.
కనుక ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జీ చేత విచారణ జరిపించాలని కోరుతూ వైసీపి పిటిషన్ వేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కొరినందున మరింత ఉన్నత స్థాయిలో అంటే సీబీఐ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read – సొంత మీడియాలో డప్పు కొట్టుకుంటే చాలా?
ఒకవేళ సీబీఐ దర్యాప్తుకి ఆదేశిస్తే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపి అధినేత జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరింత లోతుకి కూరుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే వైసీపి తన వేలితో తన కన్ను పొడుచుకోబోతోందన్న మాట. సుప్రీంకోర్టు ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించిన్నట్లు అవుతుంది కూడా. కనుక సిట్ విచారణ నిలిపివేయడం మంచి నిర్ణయమే. ఈ విషయం వైసీపికి తర్వాత అర్ధం అవుతుంది.