Supreme_Court_Of_Indiaఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన అక్రమాస్తుల కేసుల విచారణ ఇంకా ఎన్నేళ్ళు సాగుతాయో తెలీదు కానీ ఆ కేసులలో నిందితులందరూ ఎప్పటికైనా జైలుకి వెళ్ళకతప్పదనే విషయం జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యలలో స్పష్టమైంది.

నాడు అంటే 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన క్విడ్-ప్రో కేసుతో హెటిరో గ్రూప్‌కి ఎటువంటి సంబందమూ లేదని, కనుక తమకు ఆ కేసు నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ వేసిన క్వాష్ పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు, సీబీఐ కోర్టు రెండూ కొట్టివేయడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టు వెళ్ళింది. ఆ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Also Read – విమలారెడ్డి చెప్పింది కాస్త వినండర్రా!

ఈ క్విడ్-ప్రో, అక్రమాస్తుల కధ జరిగి అప్పుడే 16 ఏళ్ళు గడిచిపోయాయి. కనుక దాని గురించి ఓసారి క్లుప్తంగా చెప్పుకోకతప్పదు.

హెటిరో గ్రూప్ (ఏ-4), దాని డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి (ఏ-6), అరబిందో గ్రూప్ (ఏ-3)లు వైఎస్.జగన్మోహన్ రెడ్డి (ఏ-1)కి చెందిన కంపెనీ ఇంకా ప్రారంభం కాక మునుపే దానిలో రూ.350 ప్రీమియం ధరతో షేర్లు కొనుగోలుచేశాయి. ఆ తర్వాత 2006, నవంబర్‌ 17వ తేదీన అప్పటి ఏపీఐసీసీ ఎండీ (ఏ-9)కి తెలంగాణలోని జడ్చర్లలో 70 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకొన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే రోజున వాటికి ఆ స్థలాన్ని కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంటే జగన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటికి ఆ భూమిని కేటాయించినట్లు స్పష్టంగా కనబడుతోంది. ఈ వ్యవహారంపై చాలా లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ ఇది ‘క్విడ్-ప్రో వ్యవహారమే’ అని సాక్ష్యాధారాలతో సహా పేర్కొంది.

Also Read – కొలికపూడి కి ఇదే మొదటి, చివరి అవకాశమా.?

హెటిరో గ్రూప్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్నప్పుడు న్యాయమూర్తులు చేసిన కొన్ని వ్యాఖ్యలు గమనార్హమైనవి.

1. సీబీఐ ఛార్జ్-షీట్‌లో వరుసగా జరిగిన పరిణామాల తేదీలను గమనించినా క్విడ్-ప్రో జరిగినట్లు అర్దం అవుతుంది.

Also Read – సహకార టాక్సీ: రాపిడో, ఓలా కు చెక్ పెడుతుందా.?

2. కనుక ఈ వ్యవహారంలో ఎవరూ చూడలేనిది… దాగి ఉన్నదీ ఏమీ లేదు. జరిగినదంతా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కనుక ఈ కేసుతో మీకు సంబందం లేదని ఎలా అనగలరు?ఈ కేసును కొట్టివేయాలని ఎలా అడుగుతున్నారు?అని సుప్రీంకోర్టు ధర్మాసనం హెటిరో గ్రూప్ తరపు న్యాయవాదిని గట్టిగా నిలదీసింది.

3. ఈ కేసు విచారణ ముగిసేసరికి క్విడ్-ప్రో జరగలేదని, తమ క్లయింట్ నిర్దోషి అని నిరూపించబడవచ్చు కదా? అని హెటిరో తరపు న్యాయవాది ప్రశ్నించినప్పుడు “అలా పారదర్శకంగా విచారణ జరిపి న్యాయాన్యాయాలను తేల్చేందుకే దిగువ కోర్టులు మీ క్వాష్ పిటీషన్లను కొట్టివేశాయి. మేము అందుకే కొట్టివేస్తున్నామని” సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ కేసులో తీవ్రమైన ఆర్ధిక నేరం జరిగినట్లు సుప్రీంకోర్టు కూడా గుర్తించినట్లు ధర్మాసనం తాజా వ్యాఖ్యలు వింటే అర్దం అవుతోంది. కానీ మన చట్టాలు, వాటిలో లొసుగులు సుప్రీంకోర్టు చేతులను కూడా కట్టివేసినందున దోషులను గుర్తించినా శిక్షించలేని దుస్థితి నెలకొని ఉంది.