Nara Lokesh's Tweet on TATA Raises Speculations

విశాఖ రాజధాని అయితేనే అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రులు ధర్మాన, బొత్స, గుడివాడ తదితరులు బల్లగుద్ది వాదించారు. కానీ రాజధాని ఏర్పాటు చేయలేకపోయారు.

Also Read – అయితే కొడాలి నానికి ముహూర్తం పెట్టేసినట్లేగా?

ఇదీగాక సంక్షేమ పధకాలు అమలుచేయడమే అభివృద్ధి అనే మూర్ఖపు సిద్దంతాన్ని జగన్‌ అందరికీ నూరిపోశారు. కనుక సంక్షేమ పధకాల డప్పుకొడుతూనే 5 ఏళ్ళు కాలక్షేపం చేసేశారు. అందువల్ల జగన్‌ హయాంలో విశాఖ నగరంతో సహా ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదు.

రాజధాని వస్తే అభివృద్ధి జరుగుతుందనేది వాస్తవం. కానీ అభివృధ్ది జరగాలంటే రాజధాని అవసరం లేదనేది కూడా వాస్తవం.

Also Read – పెద్దల సభలో పెద్ద మనిషికి లుక్ అవుట్ నోటీస్.. హవ్వ!

కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే అమరావతి రాజధానిగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పేవారు. అంటే విశాఖ రాజధానిగా ఉండబోదని చెప్పిన్నప్పటికీ ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలు టిడిపి కూటమికే ఓట్లు వేసి గెలిపించారు.

అంటే ప్రజలు కూడా విశాఖ రాజధాని కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసిన్నట్లు అర్దమవుతోంది. మరి ప్రజలు టిడిపి కూటమిని ఎందుకు గెలిపించారు?అంటే చంద్రబాబు నాయుడు విశాఖతో ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే!

Also Read – రేషన్ బియ్యం పట్టుబడితే ఎదురు దాడి.. భలే ఉందే!

చంద్రబాబు నాయుడు 2014లో అధికారం చేపట్టినప్పుడే విశాఖని ఐ‌టి హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చాలా కృషి చేశారు. లులూ గ్రూప్ వంటి భారీ వాణిజ్య సంస్థలను విశాఖకి రప్పించారు. అలాగే ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మద్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2025 డిసెంబర్‌లోగా అందుబాటులోకి వస్తుంది.

ఇప్పటికే దీని వలన ఈ మూడు జిల్లాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా పుంజుకున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే మూడు జిల్లాలకు ఎయిర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది కనుక పరిశ్రమలు, పోర్టులు, ఐ‌టి కంపెనీలు ఎంతో మేలు కలుగుతుంది.

మంత్రి నారా లోకేష్‌ విశాఖ నగరానికి ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌కి చెందిన టీసీఎస్ కంపెనీని రప్పించేందుకు చేసిన కృషి ఫలించింది.

విశాఖలో టీసీఎస్ కంపెనీతో పాటు ఏరో స్పేస్, స్టీల్, హోటల్‌కి ఇండస్ట్రీ, పర్యాటక తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని టాటా సంస్థ ఛైర్మన్‌ నటరాజన్ చంద్రశేఖరన్ నారా లోకేష్‌కి హామీ ఇచ్చారు. ముందుగా టిసీఎస్ ఏర్పాటు చేసి దానిలో సుమారు 10,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

భారత్‌లో విండ్ మిల్స్ తయారీలో అగ్ర సంస్థగా పేరొందిన సుజలాన్, సుప్రసిద్ద ఓబిరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, భారీ షాపింగ్ మాల్స్, ఫుడ్ ఇండస్ట్రీలో పేరు గాంచిన లులూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బ్రూక్ ఫీల్డ్ తదితర కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం వాటితో చర్చలు జరుగుతున్నాయి.

కనుక త్వరలోనే ఏపీకి భారీగా పెట్టుబడులు వాటితో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు రాబోతున్నాయి. కనుక రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి సాధ్యమే అని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించబోతున్నారు.