వైసీపీ ప్రభుత్వంలో అప్రజాస్వామికంగా జరిగిన అక్రమాల చిట్టా పొద్దును తయారు చేసి దానికి రెడ్ బుక్ గా లోకేష్ నామకరణం చేసిన విషయం అందరికి తెలిసిందే. దీనితో ఈసారి కూటమి ప్రభుత్వంలో ఆ రెడ్ బుక్ లెక్కలు సరిచేసేదెవరు అనేదాని మీదే అందరి ద్రుష్టి పడింది.
అయితే జనసేన అభిమానులు పవన్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా హోమ్ మంత్రి కూడా వస్తుందని, పవన్ ఆ శాఖను తీసుకోవాలని ఆశపడ్డారు. అలాగే రెడ్ బుక్ సృష్టికర్త లోకేష్ ఈసారి హోమ్ శాఖను తీసుకుని వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న అన్నిటిని వారికీ తిరిగిచ్చేయాలంటూ అటు టీడీపీ మద్దతుదారులు కూడా హోమ్ శాఖ లోకేష్ తీసుకోవాలని ఆశించారు.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు: కేటీఆర్ అనుకుంటే హరీష్ రావుతో బోణీ?
అయితే బాబు మాత్రం అనూహ్యంగా పాయకాపురం ఎమ్మెల్యే గా గెలిచిన ఒక ఎస్సి మహిళ వంగలపూడి అనితకు హోమ్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనిత కూడా గత ఐదేళ్లుగా వైసీపీ వేధింపులు తట్టుకుంటూ, తన పై జగన్ సర్కార్ మోపిన అక్రమ కేసులకు భయపడకుండా పార్టీ కోసం పనిచేసారు. అలాగే గత ప్రభుత్వంలో బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలను సైతం ధీటుగా ఎదుర్కొంటు మీడియాలో తన పార్టీ గొంతు వినిపిస్తూనే ఉండేది.
వైసీపీ ఫెయిర్ బ్రాండ్ రోజా నోటికి అదే స్థాయిలో తాళం వేయగల ఏకైక టీడీపీ మహిళ నాయకురాలిగా అనిత గుర్తింపు పొందారు. కంటెంట్ ఉన్నోడోకి స్క్రిప్ట్ తో పని లేదు అనేలా అనిత ఎటువంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా అనర్గళంగా తన గళం వినిపించగలరు. ప్రత్యర్థులను వెనకడుగు వేయించగలరు కూడా. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకైమైన ఈ హోమ్ శాఖను ఎస్సి మహిళలకే కట్టబెట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్.
Also Read – “పుష్ప 2” క్రేజ్… ప్రేక్షకుల ముఖచిత్రమేమిటి..?
వైసీపీ మొదటిదఫా మంత్రి వర్గంలో మేకపాటి సుచరిత ఈ శాఖ బాధ్యతలు తీసుకోగా ఆమెకు హోమ్ శాఖ మీద ఎంత పట్టుందో ఒక హోమ్ గార్డ్ ప్రవర్తన చూసినా అర్ధమయిపోయేది. అప్పటి ప్రతిపక్ష నేత బాబు ఇంటి మీద దాడి జరిగిన సంఘటన, బాబు పై రాళ్ళతో దాడి జరిగిన ఘటనలు ఆమె హయాంలోనే జరిగినాయి. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సర్వసాధారణమంటూ ఆనాటి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ దాడులను సమర్థిస్తూ ప్రకటనలు చేసినా కనీసం మీడియా ముందుకు రాలేని పరిస్థితి హోమ్ మంత్రిది.
ఆ తరువాత బాధ్యతలు అందుకున్న తానేటి వనిత ఆ పదవికి ఉన్న గౌరవాన్ని ఇంకాస్త దిగజార్చారనే చెప్పాలి. మహిళ పై అత్యాచారం జరిగితే దొంగతనానికి వేళ్ళాడే కానీ ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు అంటూ నేరస్తుడికి మద్దతు పలికిన ఏకైక మహిళ హోమ్ మినిస్టర్ గా చరిత్ర కెక్కారు వనిత. అలాగే రాష్ట్రంలో మహిళ మీద జరిగే అత్యాచారాలకు బాధితుల తలిదండ్రుల నిర్లక్ష్యమే కారణం అంటూ చేసిన వనిత వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి.
Also Read – నంద్యాల వైల్డ్ ఫైర్: ఏపీ ప్రభుత్వం హుందాతనం శభాష్!
ఒక మహిళ గా హోమ్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ తన చేతకాని తనాన్ని సాటి మహిళలపై రుద్ది చేతులు కడుక్కుని తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారు మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత. అయితే తానూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల పై జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ బాధితులకు న్యాయం చేయడానికి ఎంతవరకైన పోరాడగలను అని నిరూపించుకున్నారు అనిత.
గతంలో తనను అరెస్టు చేయడానికి తన ఇంటి ముందు క్యూ కట్టిన పోలీసులు ఇప్పుడు తన భద్రత కోసం నిలబడడం, గతంలో తన గొంతు వినడానికి కూడా సమయం ఇవ్వని అధికారులు ఇపుడు తన ఆదేశాల కోసం ఎదురు చూడడం అంతా కూడా దేవుని స్క్రిప్టా..లేక బాబు స్క్రిప్టా. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికీ పార్టీ నుంచి మంచి గుర్తింపు ఖచ్ఛితంగా వస్తుంది అనేది అనిత విషయంలో బాబు చేసి చూపించారు.
పార్టీ కోసం కష్టపడి పదవి దక్కించుకున్న అనితకు…నాయకుడి కోసం ప్రజలను కష్టపెట్టిన వనితకు ఉన్న వ్యత్యాసం రానున్న రోజులలో తెలుస్తుంది.