TDP Formation Day

దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టి మద్యలోనే పోతుంటాయి. కానీ 1982, మార్చి 29న నందమూరి ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగు దేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ధృఢంగా నిలబడింది. 43 వసంతాలు పూర్తిచేసుకొని నేడు 44లోకి అడుగుపెడుతోంది.

నాడు ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు టీడీపీని స్థాపించినప్పటికీ ఆ తర్వాత టీడీపీ వల్లనే రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ ప్రేరణతో పార్టీలు స్థాపించి చేతులు కాల్చుకున్నవారు కొందరైతే, ఆయన ప్రేరణ, ఆహ్వానంతో రాజకీయాలలో ప్రవేశించి రాణించినవారు కోకొల్లలు.

Also Read – ఏ.ఆర్. రెహమాన్‌కు 2 కోట్ల జరిమానా!

తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నుంచే బీసీలకు రాజ్యాధికారంలో భాగం హక్కుగా లభిస్తోంది. దయనీయ స్థితిలో ఉన్న బడుగు బలహీన వర్గాల అవసరాలకు అనుగుణంగా ఒక్క రూపాయికే కిలో బియ్యం వంటి అనేక సంక్షేమ పధకాలు అమలు చేయడం మొదలైంది. ఆయన చేసిన పాలనాపరమైన సంస్కరణలే నేటికీ అమలవుతున్నాయి.

ఒకవేళ ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి చొరబడకపోయి ఉంటే ఆయన రాజకీయాలలో మరెన్ని అద్భుతాలు చేసేవారో?కానీ ఆమె మెల్లగా పార్టీని ఎన్టీఆర్‌ చేతుల్లో నుంచి తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు గ్రహించినప్పుడు ధైర్యం చేసి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు.

Also Read – తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!

టీడీపీలో ఈ అధికార మార్పిడిపై ప్రత్యర్ధి పార్టీల అభిప్రాయాలు, ఆరోపణలకు చంద్రబాబు నాయుడు భయపడి నాడు వెనక్కు తగ్గి ఉండి ఉంటే, నేడు టీడీపీ ఉండేదే కాదు. దాని గురించి నేడు ఈవిదంగా చెప్పుకోవలసిన అవసరం ఉండేదే కాదు.

చంద్రబాబు నాయుడు పార్టీని, దానిపై ఆధారపడున్న లక్షలాది మంది కార్యకర్తలని కాపాడుకోవాలని గట్టిగా నిలబడ్డారు. ఆయన ఆలోచన, నిర్ణయాలని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు కనుకనే ఆయన నాయకత్వాన్ని అంగీకరించి టీడీపీకి బాసటగా నిలబడ్డారు. కనుక ఏనుగుని చూసి మొరిగే కుక్కలను పట్టించుకోనవసరం లేదు.

Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!

ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాలు, రాష్ట్ర విభజన, తెలంగాణలో టీడీపీ నేతల పార్టీ ఫిరాయింపులు, టీడీపీని సమూలంగా తుడిచిపెట్టేసేయాలని జగన్‌ చేసిన కుట్రలు, హత్యా రాజకీయాలు, రాజకీయ వేధింపులు.. ఒకటా రెండా.. అనేక సవాళ్ళని ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు పార్టీ చెల్లాచెదురు కాకుండా కాపాడుకున్నారు.

టీడీపీ శ్రేణులు, ప్రజలు మాత్రం ఆయన వెంటే ఉన్నారు. వారి నమ్మకం పొందగలిగారు కనుకనే మళ్ళీ మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాగలుగుతోంది.

ఓ రాజకీయ పార్టీ మనుగడకి అధికారంలో ఉండటం ఎంత అవసరమో కేసీఆర్‌, జగన్‌ల దయనీయ పరిస్థితి చూస్తే అర్దమవుతుంది. వారిద్దరికీ అహంభావం చాలా ఎక్కువ. అందువల్లనే అందరినీ కలుపుకుపోలేక ఇద్దరూ రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు.

ఆ అహంభావంతోనే ఇద్దరూ తమ పార్టీలను స్వయంగా దెబ్బతీసుకున్నారు. తమ అహంభావం వలననే ఒంటరిగా మిగిలిపోయామనే విషయం వారికీ తెలుసు. కానీ ‘సింగిల్ సింహాలం మేము’ అనే అందమైన ముసుగు వేసుకుని, మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలని ఎద్దేవా చేస్తూ బ్రతికేస్తున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు పార్టీ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఓ మెట్టు దిగేందుకు వెనకాడరు. రాజకీయాలలో అందరినీ కలుపుకు ముందుకు సాగిపోతుంటారు. ఆయన రాజకీయ విధానాలు సరైనవి గనుకనే టీడీపీ, తొలిసారిగా జనసేనని కూడా ఆయన అధికారంలోకి తీసుకురాగలిగారు.

ఎన్టీఆర్‌ టీడీపీకి బలమైన పునాది వేస్తే చంద్రబాబు నాయుడు ఆ పునాదిపై ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని బలంగా నిలబడగలిగేలా పార్టీని నిర్మించారు.




అనేక ఆటుపోట్లు తట్టుకొని అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ, జనసేనలు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం వాటి నాయకత్వ సమర్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి… వాటి రాజకీయ దృక్పదం సరైనదేనని అందరూ గుర్తించేలా చేస్తోంది కదా?