
ఇంతకాలం ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి వైసీపికి వంతపాడుతుండేవారు. మార్గదర్శిలో అవకతవకలు జరుగుతున్నాయని కేసు వేసింది ఆయనే. కానీ రామోజీరావు చనిపోగానే ఆయన అంత శక్తివంతుడైన వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదంటూ పొగడ్తలు అందుకున్నారు.
Also Read – వైసీపీ ని తొక్కారు..ఇక సాక్షిని కూడా తొక్కాలా.?
అలాగే ఎన్నికలలో వైసీపి ఓడిపోగానే అసలు ఏపీలో వైసీపి అనే పార్టీయే లేదంటూ ప్రకటించేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “నేను జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఏపీలో టిడిపి చాలా బలంగా ఉందని, కానీ వైసీపి బలంగా లేదని కనుక గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మించుకోకపోతే ఎన్నికలలో టిడిపిని ఎదుర్కోవడం కష్టమవుతుందని నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఆయన నా మాటలు పట్టించుకోలేదు. \
అసలు ఏపీలో వైసీపి ఎక్కడ ఉంది? పైన జగన్ ఉన్నాడు… రాష్ట్రంలో ఓటర్లున్నారు. వారికి జగన్‌కు మద్య వాలంటీర్లున్నారు తప్ప పార్టీ నేతలేరి?వాలంటీర్లుకు మరో 5 వేలు ఎవరు ఎక్కువిస్తే వారికే పనిచేస్తారు తప్ప వైసీపి కోసం పనిచేస్తారా? కనుక ఈ 5 ఏళ్ళలో కనీసం పార్టీని నిర్మించుకోమని జగన్‌కు సలహా ఇస్తున్నాను.
Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..
పార్టీ నేతలు కనీసం సంస్కారం కూడా లేకుండా శాసనసభలోనూ బూతులు మాట్లాడుతుంటారు… మీడియా ముందుకు వచ్చినప్పుడు బూతులే మాట్లాడుతుంటారు. పార్టీ అధికార ప్రతినిధులను పెట్టండి. పార్టీ నేతలందరికీ మీడియా ముందుకు వచ్చి ఎలా సంస్కారంగా మాట్లాడాలో నేర్పించండి.
మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి ప్రజలు మీకు మంచి అవకాశమే ఇచ్చారు. కనుక దీనిని సద్వినియోగించుకొని అందరూ కూర్చొని ఈ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకొని తప్పులు సరిదిద్దుకోండి,” అని హితవు పలికారు.
Also Read – అయ్యో ‘నానీ’లు ఇలా అయిపోయారే..!
అయితే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇలా ధైర్యంగా మాట్లాడిన్నట్లే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నిర్భయంగా మాట్లాడి ఉండి ఉంటే ఇప్పుడు ఉండవల్లి మాటలకు విలువ ఉండేది. ఇంతకాలం ఆయన కొమ్ముకాస్తున్నట్లు మాట్లాడి ఇప్పుడు ఓడిపోగానే పార్టీ ఫిరాయించిన్నట్లు ఈవిదంగా మాట్లాడి ప్రయోజనం లేదు. అయినా నేటికీ జగన్ ఓడిపోయినందుకు ఆయన మనసులో బాధపడుతూనే ఉన్నారని మాటల్లోనే వ్యక్తం అవుతోంది కదా?