
అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, గత వైసీపీ నిరంకుశత్వాన్ని ఎండగట్టిన కొలికపూడి శ్రీనివాస్ 2024 ఎన్నికలలో టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నాడు. కూటమి పొత్తులో భాగంగా అనేకమంది టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే లకు, పార్టీ విధేయులకు కూడా దక్కని సువర్ణ అవకాశం కొలికపూడిని వరించింది.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
మొదటసారి ఎమ్మెల్యే అయిన కొలికపూడి ప్రభుత్వ కార్యక్రమాలతో కన్నా వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. ఓ సమావేశంలో రైతులను కుక్కలతో పోలుస్తూ ఒకసారి వివాదాలను ఎదుర్కొన్నారు, తన పై హత్యా ప్రయత్నం జరుగుతుందని, తనకు న్యాయం చేయాలంటూ అధికార పార్టీలోనే ఉంటూ దీక్ష చేపట్టారు మరో సారి సంచలనం సృష్టించారు.
ఇలా నిత్యం ఎదో ఒక వివాదంతో వార్తలలో నిలుస్తూ చివరికి టీడీపీ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ఆపార్టీ క్రమశిక్షణా సంఘం ముందు కూడా హాజరయ్యి అందుకు తగ్గ వివరణ కూడా ఇచ్చుకున్నారు కొలికపూడి. అయినా ఈయన గారి తీరు మారడం లేదు.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
తాజాగా సొంత పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి పై బహిరంగ ఆరోపణలు చేస్తూ మరోమారు మీడియాకెక్కారు తిరువూరు ఎమ్మెల్యే. రమేష్ రెడ్డి తనతో అసభ్యంగా ప్రవరించాడంటూ ఓ గిరిజన మహిళ తనకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయాన్ని తానూ అధిష్టానం వద్దకు తీసుకు వెళ్లానని, సంఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇంకా అధిష్టానం నుండి ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ తన అసహనాన్ని వ్యక్తపరిచారు కొలికపూడి.
అయితే ఇంత వరకు కొలికపూడి ప్రదర్శించిన నిరశన కాస్త పద్డతిగానే ఉన్నప్పటికీ ఈయన గారు ఏకంగా అతని పై మరో 48 గంటలలో చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇలా ఎదో ఒక కారణం తో నిత్యం వివాదాల చుట్టూ తానూ తిరుగుతూ తద్వారా తన పార్టీని కూడా వార్తలలో నిలుపుతున్నాడు కొలికపూడి.
Also Read – సిఎం చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని విజ్ఞప్తి
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులలో, అటు జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పరితపిస్తున్న బాబు అటు ప్రభుత్వ పని తీరుతో పాటుగా ఇటు పార్టీ అంతర్గత విషయాల కోసం కూడా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అటువంటి సమయంలో ఇటువంటి సమస్యలను చర్చించి బాధితులకు న్యాయం చేయడం, దోషులను ఆధారాలతో అధిష్టానం ముందుంచడం చెయ్యాలి.
నేరారోపణ పై ఎటువంటి ఆధారాలు చూపకుండా నేను చెప్పాను, మీరు చర్యలు తీసుకోండి, లేకుంటే రాజీనామా చేస్తాను అంటూ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చిన్నపిల్లాడి మాదిరి బెదిరించడం చూస్తుంటే కొలికపూడి శ్రీనివాస్ కు టీడీపీ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇదే మొదటిది, ఇదే చివరిది కానుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్ని కోట్ల మందిలో ఒక పార్టీ నేతగా, ఒక నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా అవకాశం వస్తే దాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి వెచ్చింది, అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇటు పార్టీని బలపరుస్తూ, అటు వ్యక్తిగతంగా రాజకీయ బలం పెంచుకోవాల్సిన ఎమ్మెల్యే లు ఇలా నిత్యం వివాదాలతో సహవాసం చేయడం ఎంతవరకు సమంజసం. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికి ఒక్క అభివృద్ధి కార్యచరణతో వార్తలలో నిలవలేని కొలికపూడి, వివాదాలతో మాత్రం మీడియాలో దర్శనమిస్తూనే ఉంటున్నారు.