YCP Social Media

కొట్టండి జేజే లు..పెట్టండి డీజే లు…జూన్ 9 న సంబరాలకు సిద్ధం కండి అంటూ వైసీపీ గెలుపు పై తొందరపడి సాక్షి మీడియా ముందే కూసి నవ్వులపాలయ్యింది. అయితే సీన్ కట్ చేస్తే సరిగ్గా జూన్ 4 ఎన్నికల ఫలితాల నాడు తీయండ్రా పసుపు జెండాలు…వేయండ్రా ఎర్ర కండువాలు అన్నట్టుగా ఏపీ ఓటర్లు 164 సీట్లతో కూటమి పార్టీకి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు.

వైస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలతో పాటుగా కొన్ని మీడియా ఛానెల్స్ ను కూడా నేరుగా టార్గెట్ చేస్తూ వారి ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బ కొట్టారు. అందులో రామోజీ రావు ఈ టీవీ, టీవీ 5 , ఆంధ్రజ్యోతి ఛానెల్స్ ను ప్రముఖంగా టార్గెట్ చేసారు వైసీపీ నేతలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రము ఏ ఒక్క గొంతు వినపడకూడదు అన్నట్లుగా ఈ ఛానెల్స్ మీద మానసిక దాడి చేసారు జగన్.

Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?

వీరికి ఎల్లో మీడియా, దుష్టచతుష్టయం అంటూ నామకరణాలు కూడా చేసి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేసారు. ప్రభుత్వం తరుపున నిర్వహించే ఏ అధికారిక కార్యక్రమానికైనా ఈ మూడు మీడియా ప్రతినిధులకు అనుమతి ఉండేది కాదు. ఒక వేళ వారు అక్కడికి వెళ్లినా వైసీపీ నుంచి అవమానాలే ఎదుర్కొని బయటకు రావాల్సి వచ్చేది. ఈ ఐదేళ్లలో ఈ మూడు ఛానెల్స్ ప్రతిపక్షాలు ఎదుర్కొన్నన్ని అవమానాలను, ఎదురు దెబ్బలను స్వీకరించాల్సి వచ్చింది.

గత ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రకటనలు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలకు గాని అగ్ర తాంబూలం సాక్షి మీడియాకే దక్కేది. ఆ తరువాత స్థానాలను టీవీ 9 , N టీవీ లు దక్కించుకునేవి. వైసీపీ తానూ పెట్టె ప్రెస్ మీట్లకు ఎల్లో మీడియా అని భావించే మీడియా ప్రతినిధులకు అనుమతినిచ్చేది కాదు. కానీ టీడీపీ, జనసేనలు నిర్వహించే మీడియా సమావేశాలకు మాత్రం ఈ నీలి మీడియాలు ప్రత్యక్షమయ్యేవి.

Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!

అలాగే ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తూ జగన్ కు తమ వంతు మేలు చేయడానికి మీడియా విలువలను కూడా దిగజార్చడానికి సిద్దమయ్యి పలుమార్లు లోకేష్ చేతులో ర్యాగింగ్ కూడా ఎదుర్కొంది నీలి మీడియా. అయితే ఇదంతా గడిచిపోయిన గతం కానీ ఇప్పుడు ఈ నీలి మీడియా చేసిన దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టడంతో మొన్నటిదాకా తిట్టిన నోటితోనే ఇప్పుడు డప్పుకొట్టాల్సి వస్తుంది.

అలాగే నిన్నటి వరకు బాబు, పవన్, లోకేష్ లను అవమానించడానికే కథనాలు ప్రచురించే మీడియా ఛానెల్స్ ఇప్పుడు వారినే కీర్తిస్తూ కథనాలను తయారు చేయాల్సిన పరిస్థితి. సాక్షిలో అయితే జనసేన పార్టీ పేరు కానీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఊసు కానీ ప్రస్తావించడానికి కూడా ఆలోచించేవారు. ఎదో ఒక రోజు సాక్షిలో జనసేన పేరు, పవన్ కళ్యాణ్ అనే ఊసు గట్టిగా వినపడుతుంది…మీరు వినిపిస్తారు…అలాచేసే బాధ్యత నాది అంటూ సాక్షి కి సవాల్ చేసారు పవన్.

Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!

ఇప్పుడు అదే సవాల్ నిజమయ్యింది. అయితే ఈ లిస్టు లో సాక్షి కంటే ముందుగా డ్యూటీ ఎక్కారు జగన్. ఎప్పుడు దత్తపుత్రుడు అంటూ హేళన చేసిన నోటితోనే పవన్ కళ్యాణ్ గారు అంటూ సంభోదించి జగన్ తనకు మర్యాద ఇవ్వడం కూడా తెలుసనీ తెలుగు ప్రజలకు తెలియచెప్పారు. అయితే ఈనాడు జరిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవానికి ఈ నీలి మీడియాకు ప్రభుత్వ అధికారులు పాస్ లు నిరాకరించారు.

దీనితో సాక్షికి ఒక్కసారిగా ఎక్కడో మండినట్టుంది. మీడియా గొంతు నొక్కుతారా.? ప్రజాస్వామ్య విలువలను కాల రాస్తారా.? అధికారంతో అణిచి వేతలకు పాల్పడతారా.? అంటూ తానూ పాటించని విలువల గురించి హిత బోధ మొదలుపెట్టింది. వివేకా దారుణ హత్యను గుండె పోటుగా ప్రచారం చేసిన సాక్షి..సాక్ష్యాలను ఏమార్చడానికి కూడా వెనుకాడదని నిరూపించుకుంది.

ఇలా అధికారం ఉన్నన్నాళ్లు అప్రజాస్వామ్యానికి అండగా, విధ్వంసానికి వెన్నుగా, అన్యాయానికి తోడుగా వార్తలను ప్రచారం చేసిన సదరు నీలి మీడియా వారికీ చేసిన తప్పుకు ఫలితం అనుభవించే రోజులు వచ్చాయని, రానున్న ఈ ఐదేళ్లు తమకు నచ్చని, తాము మెచ్చని వారి గురించి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ఇక వీరికి రక్త కన్నీరు తప్పేలా లేదుగా.