రాజులు, రాజ్యాలు, సంస్థానాలు, జమీందారీలు ఎప్పుడో పోయాయి… అని అందరూ అనుకుంటారు. కానీ అవి రూపం మార్చుకొని ప్రజాస్వామ్యం ముసుగులో మళ్ళీ ఎప్పుడో వచ్చేశాయి. తమిళనాడు రాజకీయాలను అన్నాడీఎంకె, డీఎంకె పార్టీల అధినేతలు, దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి చాలా దశాబ్ధాలపాటు శాశించారు. జయలలిత వారసులు లేకపోవడంతో శశికళ ఆ కుర్చీని కబ్జా చేయాలనుకున్నారు కానీ నాలుగేళ్ళు జైల్లో గడపాల్సి వచ్చింది.
డీఎంకె అధినేత కరుణానిధి వీల్ చైర్‌లో నుంచి లేచి నిలబడలేని, మాట్లాడలేని పరిస్థితికి వచ్చేవరకు, అంటే చనిపోయే ముందు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన వారసుడిగా ఎంకె స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్ళు. కనుక తన కుమారుడు, నటుడు, తన ప్రభుత్వంలో యువజన, క్రీడాశాఖ మంత్రి ఉదయానిధి స్టాలిన్‌కి నేడు ఉప ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారు. అంటే తమిళ సామ్రాజ్యానికి మూడో తరం వారసుడు వచ్చాడన్న మాట.
ఉదయనిధి మారన్ మంచి నటుడు అనేక తమిళ సినిమాలలో నటించారు కూడా. కనుక అభిమానూలు, సంఘాల సపోర్ట్ ఉండనే ఉంది. రాజకీయ కుటుంబంలో జన్మించినందున రాజకీయాలలో కూడా బాగానే రాణించారు.
ముఖ్యంగా బడుగు బలహీనవర్గాల యువతని ఆకట్టుకోగలిగారు. అదే ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యింది. కనుక ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభిస్తోంది. తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయమే. అన్నట్లు ఉదయానిధి స్టాలిన్‌కి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కనుక తమిళ సామ్రాజ్యానికి నాలుగో తరం వారసుడు కూడా రెడీగానే ఉన్నాడు. కనుక నో వర్రీస్!




