
ప్రస్తుతానికి రాష్ట్రంలో వరద రాజకీయానికి విరామమిచ్చిన వైసీపీ మెడికల్ కాలేజీల విషయాన్నీ లేవనెత్తింది. అయితే ఈ విషయంలో వైసీపీ vs కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ వివాదానికి వివరణ ఇవ్వడానికి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెర మీదకొచ్చారు.
Also Read – సంగీతంలో లెజెండ్ – మీడియా అంటే ఆమడ దూరం. వివాదాల భయమా?
గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆమోద ముద్ర వేశారని, అందులో మా హయాంలో 5 కళాశాలలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామంటూ కూటమి ప్రభుత్వానికి సమాధానమిచ్చారు. దానితో పాటుగా ఆ మిగిలిన పెండింగ్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలంటూ మాజీ గారు ప్రస్తుత మంత్రి గారికి పనిలో పనిగా ఓ సలహా కూడా ఇచ్చేసారు.
అలాగే రాత్రికి రాత్రే అన్ని కళాశాలల నిర్మాణాలు పూర్తి చెయ్యలేం కదా.! మా హయాంలో ఎంతమేరకు పూర్తి చేయగలిగామో అంతా చేసాము. మిగతా పనులు ఆ తరువాత ప్రభుత్వాలు కొనసాగించాలి అంటూ రజని గారు బాగానే నీతి ప్రవచనలు చెపుతున్నారు. అయితే మాజీ మంత్రి మాటలు విన్నాక అందరి మదిలోను ఒకటే సందేహం…అవి వైసీపీ కి వర్తించవా అని.
Also Read – మద్యం కుంభకోణం: అందరిదీ ఒకటే మాట!
2014 నుంచి 2019 వరకు ప్రజలు టీడీపీ కి అధికారం అందించారు. ఆ ఇచ్చిన 5 ఏళ్ళ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? పోలవరం ప్రాజెక్ట్ ను ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు.? అంటూ ఒడ్డున కూర్చుని ప్రభుత్వం మీద రాళ్లు కాదు ఒకరకంగా రాడ్లే విసిరారు ప్రతిపక్షంలో ఉన్న అప్పటి వైసీపీ.
అయితే 2019 నుండి 2024 వరకు అధికారాన్ని అనుభవించిన వైసీపీ రాజధాని నిర్మాణాలను కొనసాగించలేడు సరికదా కనీసం రాజధాని తరళింఫుని కూడా పూర్తి చేయలేకపోయింది. అలాగే పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేం అంటూ చేతులెత్తేశారు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి గారు. ఇప్పుడేమో ఐదేళ్లలో ఇన్ని కళాశాలలను ఎలా పూర్తి చేయగలుగుతాము అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
Also Read – విజయశాంతి కోపం.. మరి సగటు ప్రేక్షకుడు?
ఐదేళ్ల సమయంలో కాలేజీల నిర్మాణాలే పూర్తి చేయలేకపోతే ఒక రాజధాని నిర్మాణం పూర్తవుతుందా.? నిధులు లేక ఆదాయం లేక అప్పులతో అల్లాడుతున్న రాష్ట్రానికి రాజధాని నిర్మాణాలకు, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఐదేళ్ల సమయం సరిపోతుందా.? గట్టున కూర్చొని ప్రభుత్వం మీద రాళ్ళేయ్యడం సులువైనదే, కానీ అదే విమర్శ తనదాకా వస్తే వచ్చే ప్రభుత్వాలు వాటిని కొనసాగించాలి, పూర్తి చెయ్యాలి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పి తప్పు నుండి తప్పించుకోవడం వైసీపీకి ఎంత వరకు సబబా.?