వైసీపీ పార్టీలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు స్వరం వినిపించినా, జగన్ కు వ్యతిరేకంగా ఎవరు విమర్శలు చేసినా వారికీ పచ్చ ముద్ర వేయడం జగన్ అండ్ కో కు అలవాటు గా మారిపోయింది. జగన్ తల్లి విజయలక్ష్మి జగన్ తన సొంత చెల్లి షర్మిల కు ఆమె పిలల్లకు హక్కుగా రావాల్సిన తాత ఆస్తి ని అడ్డుకుంటూ ఆర్థిక నష్టం చేస్తున్నారంటూ కోర్టు కు వెళ్లినా అందుకు బాబే కారణం అంటూ వైసీపీ ప్రచారం మొదలుపెడుతుంది.
ఇక జగన్ చెల్లెలు షర్మిల తనకు జగన్ అన్యాయం చేస్తున్నాడని, సొంత తల్లికి వ్యతిరేకంగా కోర్ట్ లో కేసులు వేసి విజయమ్మను మానసిక క్షోభకు గురిచేస్తున్నదంటూ ఆరోపణలు చేసినా అందుకు బాబే కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ బాబు ని దోషిగా చిత్రీకరిస్తారు.
చివరికి తన తండ్రి దారుణ హత్యకు వైఎస్ జగన్ బంధువు అవినాష్ రెడ్డి కారణమంటూ జగన్ సొంత బాబాయ్ వివేకా కుమార్తె, ఆయన సతీమణి అవినాష్ వైపు వేలెత్తి చూపినా, అవినాష్ ను కాపు కాస్తుంది జగనే అంటూ నినదించినా అందుకూ బాబే కారణం అంటూ నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేస్తారు.
అయితే వీరంతా జగన్ కు అనుకూలంగా వైసీపీ కి మద్దతుగా ఉన్నంత కాలం పల్లెత్తి మాట మాట్లాడని జగన్ అండ్ కో ఒక్కసారి జగన్ కు వ్యతిరేకంగా స్వరం విప్పితే మాత్రం అది తల్లైన, చెల్లైనా, చిన్నమ్మ అయినా, బాబాయ్ కుమార్తె అయినా సరే కనికరించేదే లేదు అనేలా సాక్షి లో మొదలు వైసీపీ సోషల్ మీడియా వరకు, జగన్ దగ్గర నుంచి వైసీపీ క్యాడర్ వరకు వారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని బాబు మనుషులుగా చిత్రీకరిస్తూ వారికి పచ్చ ముద్ర వేయడం వారిలో అలవాటుగా మారిపోయింది.
ఇటువంటి పరిస్థితులలో తాజాగా ఇప్పుడు వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్ కుటుంబానికి, జగన్ కి గతంలో అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయసాయి రెడ్డి సైతం వైసీపీ పై, జగన్ పై తన అసమ్మతి స్వరం వినిపించడం మొదలుపెట్టారు. కొత్త పార్టీ తో ఏపీ రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైన సాయిరెడ్డి వైసీపీ టార్గెట్ గా తన పొలిటికల్ జర్నీ ని మొదలుపెట్టనున్నారు.
అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మత మార్పిడిల నుంచి సజ్జల చేతి దెబ్బల వరకు ప్రతి విషయాన్ని మీడియా ముఖంగా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ దృష్టిలో సాయిరెడ్డి కూడా బాబు మనిషిగా గుర్తింపు పొందడం, ఆయన విమర్శల వెనుక, ఆయన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు వెనుక కూడా బాబే ఉన్నారని, ఆయనకు కూడా ఒక పచ్చ ట్యాగ్ వెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది.





