రెండు స్టంట్లు వేశారు.. పరామర్శకు ఎవరూ రావొద్దు!

Ambati Rambabu health update after two heart blockages and stent treatment

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకి గుండెకు రెండు స్టంట్లు పడ్డాయట. ఇప్పుడే ట్వీటేశారు. “నా రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గుండెలో రెండు బ్లాక్‌లు గుర్తించడం, వెంటనే దానికి డాక్టర్ల బృందం స్టెంట్ చికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. నన్ను కలవడానికి దయచేసి ఎవరూ హైదరాబాద్ రావద్దు. రెండు రోజుల్లో గుంటూరు వస్తాను. అక్కడ కలుసుకుందాం!” అని ట్వీటేశారు.

అసలే అయన రాజకీయాలలో చాలా పాపులర్ లీడర్. కనుక అయనను యధాతధంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. అయనని విమర్శించే అభిమానులు కూడా ఉన్నారు.

ADVERTISEMENT

కనుక అయన ఇలా ట్వీట్‌ వేయగానే చాలా మంది స్పందిస్తున్నారు. ఆయనని ప్రేమించే అభిమానులు ‘త్వరగా కోలుకోవాలని’, ‘మళ్ళీ చురుకుగా రాజకీయాలలో పాల్గొనాలంటూ’ రొటీన్ బోరింగ్ మెసేజ్‌లు పెడుతున్నారు.

కానీ అయన ప్రియ శత్రువులు పెడుతున్న సందేశాలు మాత్రం ఒక్కోటి చాలా వెరైటీగా ఉన్నాయి.

ఇక్కడ సంజన, సుకన్య తప్ప మీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరని ఒకరంటే, మీరు త్వరగా కోల్కొని ప్రెస్‌మీట్లు పెడుతూ ఉండాలి. జగన్‌ మళ్ళీ ఎన్నటికీ సిఎం కాకుండా అడ్డుకోగల శక్తి మీ నోటికి, మీ ప్రెస్‌మీట్లకు మాత్రమే ఉందని మరొకరు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

మా పవన్ కళ్యాణ్‌ ఆరోగ్యం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడవు కదా? మరిప్పుడు ననువ్వెందుకు హాస్పిటల్లో చేరావు? పవనన్నని అంటే ఇలాగే జరుగుతుందని ఒకరంటే, ఇంకా పోలేదా అన్నా? అని మరొకరు అడిగారు.

ఇంతకీ అంబటి రాంబాబు ‘నేను గుండెకు స్టంట్స్ వేయించుకొని హాస్పిటల్లో ఉన్నానని, పరామర్శించడానికి రావాలని జగన్‌కు తెలియజేస్తున్నారా?’ అని మరొకరికి ధర్మ సందేహం కలిగింది.

ఇంత మంది ఇన్ని ట్వీట్స్ వేస్తున్న జగన్‌ మాత్రం ఇంకా వేయలేదు. వేస్తారో లేదో? పరామర్శకు రాకపోతే పాయే.. కనీసం ‘గెట్ వెల్ సూన్ అంబటి రాంబాబుగారు,’ అని ట్వీట్‌ వేయకపోతే మన పరువేం కాను?

ADVERTISEMENT
Latest Stories