విజయసాయిని సజ్జల కొట్టారట.. ఈ అవమానం చాలదూ!

vijay-sai-reddy-allegations on sajjala-ramakrishna-reddy

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీలో నంబర్ 2 సజ్జల రామకృష్ణా రెడ్డి తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి ఓ పెద్ద లేఖ విడుదల చేశారు.

దానిలో అయన ఓ సంచలన విషయం బయటపెట్టారు. మంగళగిరిలో 2022లో జరిగిన పార్టీ ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చూస్తుండగా సజ్జల రామకృష్ణా రెడ్డి తనపై భౌతికదాడి చేశారనే విషయం బయటపెట్టారు.

ADVERTISEMENT

‘అయినా జగన్‌ సజ్జలని ఏమనలేదు.. కానీ నన్ను ముసలోడు.. వయసైపోయిందంటూ తన పదవులన్నీ పీకేసి, తన స్థాయి తగ్గించి చాలా అవమానించారని’ విజయసాయి రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

తనకు జగన్‌కు విశ్వాసపాత్రుడిని గాబట్టే ఆనాడు అక్రమాస్తుల కేసులలో ఆయనతో సహా జైలుకి వెళ్ళానని, వద్దనుకుంటే అప్పుడే కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడుకొని ఈ కేసులు లేకుండా బయటపడేవాడినని అన్నారు. అలాగే జగన్‌ వల్లనే మద్యం కుంభకోణం కేసులో కూడా చిక్కుకున్నానన్నారు.

ఇన్ని సమస్యలు, అవమానాలు భరిస్తూనే తాను ఢిల్లీలో ఉంటూ జగన్‌ చెప్పిన పనులు చక్కబెట్టేవాడినని, కానీ ఎప్పుడూ జగన్‌ పక్కనే ఉండే సజ్జల తనపై పితూరీలు చెప్తూ, తన స్థాయిని, గౌరవాన్ని తగ్గించేశారని విజయసాయి రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

కోటరీలో సజ్జల పార్టీ నేతలకు, కార్యకర్తలకు అడ్డుగోడగా మారారని, అయన శల్య సారధ్యం వల్లనే 2024 ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

పార్టీలో సీనియర్లందరూ పార్టీ కోసం కాక, సజ్జల రామకృష్ణా రెడ్డి కోసం పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఇప్పుడు వైసీపీలో నం:1 జగన్మోహన్ రెడ్డి కాదని, సజ్జల రామకృష్ణా రెడ్డే నం.1గా, జగన్‌ నం.2 గా మారారని విజయసాయి రెడ్డి ఆక్షేపించారు.

విజయసాయి రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే…

ADVERTISEMENT
Latest Stories