
సికింద్రాబాద్‌లో తిరుమలగిరి చర్చిలో పాస్టర్‌గా చేస్తున్న ప్రవీణ్ పగడాల రాజమండ్రి సమీపంలో చనిపోవడంపై కేఏ పాల్, కొందరు వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి, రాజకీయాలు అందరూ చూస్తూనే ఉన్నారు.
Also Read – తెలంగాణలో కూడా సేమ్ సేమ్!
ఈ ఘటనపై వైఎస్ జగన్ మేనత్త విమలా రెడ్డి చాలా విచాక్షణతో మాట్లాడిన మాటలు కేఏ పాల్, వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా తప్పకుండా వినాలి. ఆమె ఏమన్నారంటే, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు కనుక మద్యలో దూరిపోయి ఏదేదో మాట్లాడటం సరికాదు.
క్రైస్తవుల జీవితాలలో ఏమి జరిగినప్పటికీ అది ఆ భగవంతుడి ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది తప్ప వేరేగా జరుగదని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కనుక ఈ ఘటనపై మాట్లాడటం అంటే ఆయన నిర్ణయాన్ని మనం ప్రశ్నిస్తున్నట్లే అవుతుంది. కనుక నో కామెంట్స్!
Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?
క్రీస్టియన్లలో భిన్న శాఖల మద్య ఐఖ్యత లేనిమాట వాస్తవమే. ఈ విశాల ప్రపంచంలో అందరూ ఐక్యంగా ఉండటం సాధ్యం కాదు. కుటుంబాలలోనే ఐక్యత లేనప్పుడు సమాజంలో ఐక్యత సాధ్యమా? కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అందరూ ఐక్యత చూపారు. అందుకు సంతోషించాల్సిందే. ఈ ఘటనపై మా మతంలో ఇతర శాఖలకు చెందిన పాస్టర్స్ స్పందించకపోవడాన్ని తప్పుగా అనుకోరాదు.
అందరూ స్పందించడం మొదలుపెడితే ఇదో పెద్ద రాజకీయ సమస్యగా మారిపోతుంది. కనుకనే అందరూ సంయమనం పాటిస్తున్నారు. ఈ కేసులో హడావుడి చేస్తున్నవారు కూడా సంయమనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కనుక వారిని వారి పని చేసుకోనీయాలి,” అని విమలా రెడ్డి అన్నారు. కేఏ పాల్ గారు వింటున్నారా?
Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..