పిన్నెల్లి ఎక్కడా..నో ఐడియా..?

ఈవీఎం లను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుండి తప్పించుక్నుని పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. ఆయన తరుపున ఆయన న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

దీనితో పిన్నెల్లి నేరుగా నర్సరావుపేట కోర్టులో లొంగిపోతారంటూ వార్తలు రావడంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. అయితే పిన్నెల్లి కోసం ఎస్పీ, డిఎస్పీ లతో కలిసి 8 బృందాలు గాలిస్తున్నామని సీఈవో ముకేశ్ మీనా తెలియచేసారు. ఈవీఎం లను ధ్వంసం చేసిన కేసులో అసలు నిందితుడిని పట్టుకోలేకపోయిన అధికారులు ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పోలింగ్ కేంద్రంలోని పిఓ ,ఏపీఓ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ADVERTISEMENT

అయితే గత ఐదేళ్లుగా తమ చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాచర్ల నియోజకవర్గం లో టీడీపీ నేతలను అడుగుపెట్టనివ్వకుండా దాడులు చేస్తూ వారిని అంతమొందించడానికి సైతం వెనుకాడకుండా చేసిన విధ్వంసాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అందులో టీడీపీ నేత బోండా ఉమా ఆయన అనుచరులు బాధితులే. గతంలో బోండా ఉమా కారు పై ఐరన్ రాడ్లతో దాడి చేసి ఆయన కారును పూర్తిగా ధ్వంసం చేసి ఉమా మీద హత్యాయత్నానికి పాల్పడ్డారు పిన్నెల్లి.

అధికారంలో ఉన్నప్పుడు ‘మాచర్ల రౌడీ’గా చెలామణి అయిన పిన్నెల్లి ఇప్పుడు ‘పరారీలో ఉన్న ఖైదీ’ మాదిరి పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నారు. ఖర్మ ఎవరిని విడిచి పెట్టదు అనేదానికి ఇదే నిలువెత్తు ఆధారం అంటున్నారు టీడీపీ శ్రేణులు. అయితే పోలింగ్ రోజే ఇంత అరాచకం సృష్టించిన పిన్నెల్లి ఆ ఆతరువాత మాచర్ల లో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇప్పటికి పిన్నెల్లి ని అరెస్టు చేయలేకపోతే ఇక కౌంటింగ్ రోజు మాచర్లలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్ఠ వేయడం అంత సులభం కాకపోవచ్చు.

ఈవీఎం లను ధ్వంసం చేసి పోలీసులను మాయ చేసి తిరుగుతున్న ఈ వైసీపీ నాయకుడిని సమర్థిస్తూ అనేకమంది వైసీపీ నేతలు మీడియా ముందుకొస్తున్నారు. అసలు బయటకు వచ్చిన వీడియో రిలీజ్ చేసింది ఎవరు అంటూ ఒకరు.? అసలు ఈ వీడియో రియలా.? ఫెకా..? అంటూ మరొకరు ఈసీని ప్రశ్నిస్తున్నారు కానీ ఈవీఎం లను కొట్టడం నేరం అనేదాని మీద మాత్రం ఎవ్వరు నోరు మెదపడం లేదు. ఇంకెన్నాళ్లు అరాచకానికి వైసీపీ అండగా ఉంటుంది.

ఇంకెన్నాళ్లు అప్రజాస్వామ్యానికి వైసీపీ గొంతుగా మారుతుంది.? ఇంకెన్నాళ్లు దాడులకు, ఆ దాడులు చేసే నాయకులకు వైసీపీ కాపు కాస్తుంది.? అంటూ ప్రజాస్వామ్య వాదుల నుండి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నా వైసీపీ మాత్రం నిస్సిగ్గుగా తమ వాదనను వినిపిస్తూనే ఉంది. పిన్నెల్లి తప్పించుకుని రెండు రోజులు గడుస్తున్నా ఇంకా పిన్నెల్లి ఎక్కడా అంటే అధికారుల నుండి “నో ఐడియా” అనే సమాధానమే వినిపించడం చూస్తుంటే ‘చట్టాలు బలహీనుల మీద బలంగా..బలవంతుల మీద బలహీనంగా పనిచేస్తాయి’ అని నానుడి నిజమనిపిస్తుంది అంటున్నారు సామాన్యుడు.

ADVERTISEMENT
Latest Stories